వైజాగ్‌ వర్తకులకు పేటీఎం ప్రత్యేక కార్యక్రమం

14 Apr, 2022 10:28 IST|Sakshi

హైదరాబాద్‌: పేటీఎం (వన్‌ 97 కమ్యూనికేషన్స్‌) తన మర్చంట్‌ భాగస్వాముల ఆదాయం పెంపునకు ప్రత్యేక కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ప్రారంభించింది. పేటీఎం యాప్‌తో చెల్లింపులను స్వీకరించడం ద్వారా ప్రతి నెలా రూ.2,100 అదనపు ఆదాయం పొందొచ్చని ప్రకటించింది. డిజిటల్‌ చెల్లింపులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్టు పేటీఎం తెలిపింది. 

పేటీఎం అందిస్తున్న ఈ ఆఫర్‌ కింద వినియోగదారులు సైతం తమ మొదటి యూపీఐ చెల్లింపు అనంతరం రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చని పేర్కొంది. పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుత వర్తకులను ప్రోత్సహించడం, కొత్తవారిని ఆకర్షించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు సంస్థ ప్రకటించింది.
 

చదవండి: ట్రాఫిక్‌ ఈ చలాన్స్‌.. పేటీఎం ద్వారా రూ. 60 కోట్లు వసూళ్లు

మరిన్ని వార్తలు