రుణాల జోరు..పేటీఎమ్‌ సరికొత్త రికార్డ్‌లు!

12 Jul, 2022 10:23 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసుల దిగ్గజం పేటీఎమ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో భారీ స్థాయిలో రుణాలను మంజూరు చేసింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో 84.78 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి.

 వీటి ద్వారా రుణ విడుదల దాదాపు 8 రెట్లు ఎగసి రూ. 5,554 కోట్లను తాకింది. వెరసి రూ. 24,000 కోట్ల వార్షిక రన్‌రేట్‌కు చేరినట్లు కంపెనీ తెలియజేసింది. గతేడాది(2021–22) క్యూ1లో 14.33 లక్షల లావాదేవీల ద్వారా రూ. 632 కోట్ల రుణాలను జారీ చేసింది.

 అత్యుత్తమ రుణదాత సంస్థల భాగస్వామ్యాలతో రుణాల బిజినెస్‌ జోరును కొనసాగిస్తున్నట్లు పేటీఎమ్‌ పేర్కొంది. ఈ ఏడాది క్యూ1లో రుణాల సంఖ్య సైతం 492 శాతం జంప్‌చేసి 8.5 మిలియన్లకు చేరినట్లు వెల్లడించింది. విలువ 780 శాతం దూసుకెళ్లి రూ. 5,554 కోట్లకు చేరింది. 

మరిన్ని వార్తలు