ఈలాన్‌మస్క్‌.. అసలు విషయం ఎప్పుడో చెప్పు?

10 May, 2022 10:17 IST|Sakshi

ప్రపంచ కుబేరుడు ఈలాన్‌ మస్క్‌ను ఇండియన్‌ ఎంట్రప్యూనర్‌ పేటీఎం ఫౌండర్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ పలు అంశాలపై సూటీగా ప్రశ్నించాడు. కీలక అంశాలపై సూచనలు చేశాడు. విజయ్‌ శేఖర్‌ శర్మ ప్రస్తావించిన అంశాలపై ఇంకా ఈలాన్‌ మస్క్‌ స్పందన రాలేదు.

తాజ్‌ ఒక అద్భుతం
ట్విటర్‌లో బిజీగా ఉండే ఈలాన్‌ మస్క్‌.. ఆగ్రా ఫోర్ట్‌ గురించి ఓ యూజర్‌ పెట్టిన పోస్టుకు స్పందిస్తూ... 2007 నాటి భారత పర్యటనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తాను తాజ్‌ మహల్‌ను సందర్శించినట్టు.. నిజంగా అదొక అద్భుతం అంటూ కొనియాడారు.

ఇండియాలో జాగ్రత్త
ఈలాన్‌ మస్క్‌ ఇండియా టూర్‌పై పేటీఎం విజయ్‌ శేఖర్‌ శర్మ స్పందిస్తూ.. తాజ్‌మహాల్‌ దగ్గర టెస్లా కారును ఎప్పుడు డెలివరీ చేస్తావ్‌ ఈలాన్‌ మస్క్‌ అంటూ ప్రశ్నించాడు. అంతేకాదు ఈలాన్‌ మస్క్‌ మానస పుత్రిక ఆటోపైలెట్‌ (ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు)ను ఇండియాలో ప్రవేశపెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించు. ఇక్కడి రోడ్లు, ట్రాఫిక్‌ చాలా గందరగోళంగా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా నువ్వు ఆటోపైలెట్‌ డిజైన్‌ చేయాల్సి ఉంటుందంటూ సూచనలు చేశారు అయితే దీనిపై మస్క్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.


టెస్లా వివాదం
టెస్లా కార్లను ఇండియా మార్కెట్‌లో ప్రవేశపెట్టే అంశంపై ఈలాన్‌ మస్క్‌ ఆసక్తిగా ఉన్నాడు. అయితే విదేశాల్లో తయారు చేసిన కార్లను ఇండియాకి దిగుమతి చేస్తానని చెబుతున్నాడు. ఇలా దిగుమతి చేసే కార్లపై భారత ప్రభుత్వం భారీగా సుంకాలు విధించింది. వీటిని తగ్గించాలంటూ మస్క్‌ డిమాండ్‌ చేశాడు. దీనికి ప్రతిగా ఇండియాలో కార్లను తయారు చేయగలిగితే సుంకాలు తగ్గిస్తామని, ఇతర దేశాల్లో చేసిన కార్లు ఇక్కడ అమ్ముతామంటూ ఎటువంటి రాయితీలు ఇవ్వబోమంటూ తేల్చి చెప్పంది. దీంతో ఈ అంశంపై పీటముడి బిగుసుకున్నట్టైంది.

చదవండి:

మరిన్ని వార్తలు