Paytm Vijay Shakar Sharma: ‘ఎందుకిలా నిస్సహాయంగా ఉండిపోయాం’

13 Nov, 2021 19:45 IST|Sakshi

ఢిల్లీలో ప్రమాదకరంగా మారిన వాతావరణ కాలుష్యంపై పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ స్పందించారు. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 650 పాయింట్లు చూపిస్తున్న ఫోటోను షేర్‌ చేస్తూ తన ఆవేదను ఆయన పంచుకున్నారు. హౌ కన్‌ వీ లెఫ్ట సో హెల్ప్‌లెస్‌ అంటూ క్యాప్షన్‌ పెట్టారు.

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో 50 పాయింట్ల వరకు సూచిస్తే గాలి స్వచ్ఛంగా ఉన్నట్టు. 50 నుంచి 100 వరకు అయితే మోడరేట్‌, 100 నుంచి 150 పాయింట్ల వరకు ఉంటే సెన్సిటివ్‌ గ్రూప్‌కి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం, 150 నుంచి 200ల పాయింట్ల వరకు ఉంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అర్థం. 200 నుంచి 300 పాయింట్ల మధ్య ఉంటే ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. 300 పాయింట్ల మించితే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి ఉంటుంది. నవంబరు 13న ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ఏకంగా 473 పాయింట్లు దగ్గర నమోదు కావడంతో విజయ్‌ శేఖర్‌ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంపై అత్యున్నత న్యాయస్థానం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కనీసం పిల్లలను వాతావరణ కాలుష్యం నుంచి కాపాడేందుకు వారం రోజుల పాటు పాఠశాలకు సెలవు ప్రకటించారు ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌.

చదవండి: ఢిల్లీ కాలుష్యంపై సీఎం కీలక నిర్ణయం: వారం రోజులపాటు..

మరిన్ని వార్తలు