ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాకు భారీ జరిమానా

2 Oct, 2021 10:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాకు టెలికం శాఖ జరిమానా విధించింది. వొడాఫోన్‌ ఐడియాకు రూ.2,000 కోట్లు, భారతి ఎయిర్‌టెల్‌కు రూ.1,050 కోట్ల పెనాల్టీ పడింది. జరిమానా చెల్లించేందుకు మూడు వారాల గడువు ఉంది. 

ఇంటర్‌ కనెక్టివిటీ సౌకర్యం కల్పించడంలో విఫలమైనందుకు రిలయన్స్‌ జియో ఫిర్యాదు ఆధారంగా ఇరు సంస్థలపై అయిదేళ్ల క్రితం ట్రాయ్‌ చేసిన సిఫార్సు మేరకు టెలికం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 

‘ఏకపక్ష, అన్యాయమైన డిమాండ్‌తో మేము తీవ్రంగా నిరాశ చెందాము. ఈ ఆరోపణలు పనికిమాలినవి, ప్రేరేపించబడినవి. అత్యున్నత ప్రమాణాలను మేం పాటిస్తాం. చట్టాన్ని అనుసరిస్తాం. టెలికం శాఖ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తాం’ అని ఎయిర్‌టెల్‌ స్పష్టం చేసింది.  

చదవండి: టారిఫ్‌లు పెరిగితేనే టెల్కోలకు మనుగడ

మరిన్ని వార్తలు