పెన్నార్‌కు  రూ.1,167 కోట్ల ఆర్డర్లు

14 Oct, 2022 14:47 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంజనీరింగ్‌ పరికరాల తయారీ సంస్థ పెన్నార్‌ గ్రూప్‌ సెప్టెంబర్‌లో రూ.1,167 కోట్ల ఆర్డర్లను చేజిక్కించుకుంది. వీటిలో ఎన్‌టీపీసీ రెనివేబుల్‌ ఎనర్జీ నుంచి కూడా ఆర్డర్‌ పొందామని పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ స్ట్రాటజీ వైస్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌ కూరం వెల్లడించారు. ‘రాజస్తాన్‌లో ఎన్‌టీపీసీ 500 మెగావాట్ల ఏసీ/625 మెగావాట్ల డీసీ సోలార్‌ పీవీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది.

డిజైన్, సరఫరా, నిర్మాణం ప్రాతిపదికన పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ 12.5 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది.  మూడేళ్లపాటు కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలు సంస్థ స్వీకరిస్తుంది’ అని వివరించారు. రిలయన్స్, టీసీఐ లిమిటెడ్, థెర్మాక్స్, టాటా నుంచి సైతం పెన్నార్‌ గ్రూప్‌ కంపెనీలు ఆర్డర్లను పొందాయి. 

చదవండి: బ్యాంక్‌ కస్టమర్లకు వార్నింగ్‌.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్‌ చేసేయండి!

మరిన్ని వార్తలు