అప్పట్లో అంగారకుడు.. కొట్టుకొచ్చిన రాళ్లే సాక్ష్యం!! ఫొటోలు రిలీజ్‌ చేసిన నాసా

9 Oct, 2021 13:06 IST|Sakshi

ఇప్పుడంటే అంగాకర గ్రహం ఎండిపోయి.. రాళ్లు, రప్పలు, మట్టిదిబ్బలతో కనిపిస్తోంది. మరి ఒకప్పుడు? అంటే.. ఓ 3.7 బిలియన్ల సంవత్సరాల కిందట. ఆ సమయంలో మార్స్‌.. ఎర్త్ తరహాలోనే ఉండేదని పరిశోధనలు ఒక్కొక్కటిగా చెబుతూ వస్తున్నాయి. ఇంతకీ ఈ అరుణ గ్రహం మానవ నివాస యోగ్యానికి అనుకూలమా? కాదా? అనేది తేల్చేక్రమంలో ఆసక్తికరమైన విషయాలెన్నో బయటపడుతున్నాయి.


తాజాగా.. అంగారకుడిపై వరద ప్రవాహాల్ని సైతం గుర్తించింది నాసాకు చెందిన పర్సివరెన్స్‌ రోవర్‌.  తాను దిగిన జీజెరో క్రాటర్‌ ప్రాంతంలోనే ఈ రోవర్‌, వరద జాడల్ని గుర్తించడం విశేషం. కుంభవృష్టి వరదలతో లోతైన గుంతలు ఏర్పడి ఉండొచ్చని సైంటిస్టులు నిర్ధారణకు వచ్చారు. ఇక  కొత్త రోవర్‌తో అనుసంధానం కాసేపు ఆగిపోవడానికి ముందు.. పర్సివరెన్స్‌ కీ ఫొటోల్ని నాసా సెంటర్‌కు పంపింది.

 

అంగారకుడి ఉపరితలంపై తీసిన ఈ చిత్రాలను పరిశీలించిన తర్వాత.. నాసా కొన్ని విషయాల్ని వెల్లడించింది. 

ఆ కాలంలో మార్స్‌ మీద వాతావరణం(పొరలు) దట్టంగా ఉండేది(మొదటి నుంచి ఇదే చెప్తున్నారు)

► జీజెరో క్రాటర్‌ను ఒక సరస్సుగా దాదాపు నిర్ధారణకు వచ్చేశారు

నదులు, వాటి ప్రవాహం వల్ల మార్స్ మీద ఫ్యాన్‌ ఆకారంలో డెల్టా ప్రాంతాలు సైతం ఏర్పడ్డాయి 

సరస్సు(ఎండిపోయిన) చిన్నభూభాగాలు.. నది డెల్టా ప్రాంతానికి చెందినవే అయ్యి ఉంటాయి

గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో కుంభవృష్టి వరదలు ముంచెత్తాయి.. బహుశా ఆ ప్రాంతమంతా ఎండిపోయి ఉండొచ్చు 

వరదలతో సరస్సుల్లోకి కొట్టుకువచ్చిన రాళ్లురప్పల ఫొటోల్నే పర్సివరెన్స్‌ ఇప్పుడు నాసాకి పంపింది.


చదవండి: గంటన్నర పాటు భారీ ప్రకంపనలతో ఊగిపోయిన మార్స్‌...!

మరిన్ని వార్తలు