స్వల్పంగా పెరిగిన పెట్రో​​ ధరలు

26 Sep, 2021 10:29 IST|Sakshi

దేశంలో మరోసారి పెట్రో ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగా చమురు ధరల్లో  మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధరలు స్థిరంగా ఉన్నా డీజిల్‌ ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.  

దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 

హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర స్థిరంగా రూ.105.27 ఉండగా..డీజిల్​ ధర 26 పైసలు పెరిగి రూ.97.17కు చేరింది. 

వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.106.23 ఉండగా.. డీజిల్​ ధర 25 పైసలు పెరిగి రూ.97.65కు చేరింది. 

గుంటూరులో పెట్రోల్ ధర లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉండగా.. డీజిల్​ లీటర్​పై 25 పైసలు పెరిగి రూ.98.88 వద్దకు చేరింది. 

ముంబైలో  లీటర్​ పెట్రోల్​ ధర రూ. 107.27 ఉండగా  లీటర్​ డీజిల్​ ధర 25 పైసలు పెరిగి రూ. 96.65కి చేరింది. 

కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.101.64గా ఉండగా  డీజిల్​ 23 పైసలు పెరిగి రూ. 92.14కు చేరింది. 

చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.98.97 ఉండగా..  లీటర్​ డీజిల్​ 22 పైసలు పెరిగి రూ. 93.45కు చేరింది. 

మరిన్ని వార్తలు