వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోలు ధర

25 Mar, 2021 09:03 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. మార్చి 25, గురువారం పెట్రోల్ ధర లీటరుకు 21 పైసలు, డీజిల్‌పై 20 పైసలు చొప్పున  తగ్గిస్తూ  చమురు రంగ సంస్థలు నిర్ణయించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న(మార్చి24, బుధవారం) తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  గురువారం కూడా ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి.  తాజా  సవరణతో దేశ రాజధాని ఢిల్లీలో  పెట్రోలు ధర లీటరుకు. 90.99 నుండి లీటరుకు. 90.78 కు  చేరింది. డీజిల్  20 పైసలు తగ్గి 81.30 నుండి. 81.10  స్థాయికి చేరింది. 

 వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు
ముంబైలో పెట్రోలు ధర రూ.  97.19, డీజిల్‌ ధర 88.20
 చెన్నైలో పెట్రోల్‌ రూ.92.77, డీజిల్‌ రూ.86.10
 కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.90.98, డీజిల్‌ రూ.83.98
 బెంగళూరులో పెట్రోల్‌ రూ.94.04, డీజిల్‌ రూ.86.21

 హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.39 డీజిల్‌ రూ.88.45
 అమరావతి పెట్రోల్‌ రూ.96.99, డీజిల్‌ రూ.90.52

 

మరిన్ని వార్తలు