దేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

2 Oct, 2021 09:34 IST|Sakshi

దేశంలో పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడికి పెను భారంగా మారుతున్నాయి. వరుసగా మూడో రోజు శనివారం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. ముఖ్యంగా చమురు కంపెనీలు డీజిల్‌ ధరల్ని ఊహించని విధంగా  పదిరోజుల వ్యవధిలో ఆరుసార్లు పెంచాయి.సెప్టెంబర్​ 22న లీటర్ డీజిల్​ ధర రూ.96.69 ఉండగా అక్టోబర్​1వ తేదీ నాటికి ఆ ధర రూ.98.39కి చేరింది. దీంతో ఈ ఏడాది జూన్​లోనే పెట్రోల్​ సెంచరీ మార్క్ ను క్రాస్‌ చేయగా.. డీజిల్‌ ధర సైతం అదే దారిలో ఉంది.  

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 106.00 ఉండగా డీజిల్ ధర రూ.98.39 ఉంది

విజయవాడలో పెట్రోల్ ధర రూ.108.20 ఉండగా.. డీజిల్ ధర రూ. 100.05  ఉంది

వైజాగ్‌లో  పెట్రోల్ ధర రూ. 107.35 ఉండగా..డీజిల్‌ ధర రూ. 99.21 ఉంది

ఢిల్లీలో  పెట్రోల్ ధర రూ. 101.89 ఉండగా డీజిల్ ధర రూ.90.17  ఉంది. 

కోల్ కతాలో  పెట్రోల్‌ ధర రూ. 102.47 ఉండగా డీజిల్ ధర రూ.93.27  ఉంది. 

ముంబైలో పెట్రోల్‌ ధర రూ. 107.95 ఉండగా డీజిల్ ధర రూ.97.84  ఉంది. 

చెన్నైలో పెట్రోల్‌ ధర  రూ. 99.58 ఉండగా డీజిల్ ధర రూ.94.74  ఉంది. 
 

మరిన్ని వార్తలు