రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పెట్రోల్ ధరలు

22 Jun, 2021 15:03 IST|Sakshi

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డు సృష్టిస్తున్న ఇంధన ధరలు ఒకరోజు విరామం తరువాత నేడు మళ్ళీ భారీగానే పెరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు జీవిత కాల గరిష్ఠాన్ని తాకాయి. ఢిల్లీలో పెట్రోల్ ధరలు 28 పైసలు పెరగడంతో రూ.97.50 చేరుకుంటే, డీజిల్ ధర 26 పైసలు రూ.88.23కు చేరుకుంది. హైదరాబాద్ లో తాజాగా నేడు పెట్రోల్ ధరలు 29 పైసలు, డీజిల్ 28 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.101.33, డీజిల్ ధర రూ.96.17గా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

  • చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.65, డీజిల్ ధర రూ. 92.83
  • ముంబైలో పెట్రోల్ ధర రూ. 103.63, డీజిల్ ధర రూ. 95.72 
  • కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 97.38, డీజిల్ లీటరుకు రూ. 91.08 
  • భోపాల్‌లో పెట్రోల్ ధర రూ. 105.72, డీజిల్ ధర లీటరుకు రూ. 96.93
  • బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 100.76, డీజిల్ ధర లీటరుకు రూ. 93.54

దేశంలోని చాలా నగరాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ.100 మార్కును తాకింది. మే 4 నుంచి వేగంగా పెరిగిన చమురు ధరలు. కేవలం 29 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.7.18 పెరిగితే, డీజిల్ ధర రూ .7.45 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలను బట్టి దేశీయ ఇంధన ధరలు మారుతాయి. అంతేగాక, ఆర్థిక వృద్ధి కూడా పెట్రోల్ ధరల పెరుగుదల, పతనానికి కారణం. పన్నులు, సరుకు ఛార్జీలను బట్టి ఇంధన ధరలు రాష్ట్రాన్ని బట్టి మారతాయి.కొత్త ఇంధన ధరలను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మారుస్తారు.

చదవండి: చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్‌సంగ్

మరిన్ని వార్తలు