Petrol Diesel Rates: పండుగ తెల్లారి మళ్లీ పెంపు! ఈసారి ఎంతంటే..

16 Oct, 2021 09:19 IST|Sakshi

Petrol Diesel Prices Today: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు.  ముడి చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్‌ ధరలు 18 సార్లు పెరగ్గా.. పెట్రోల్‌ ధరలు 15 సార్లు ఎగబాకాయి.
 

తాజాగా దసరా తెల్లారి శనివారం లీటర్‌ పెట్రోల్ 36 పైసలు‌, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో ఇవాళ(అక్టోబర్​ 16, శనివారం) లీటర్ డీజిల్ ధర రూ. 102.80, లీటర్ పెట్రోల్ ధర రూ.109.73కు చేరుకుంది. ఇక ఢిల్లీలో పెట్రోల్​ ధర రూ.105.49పై.లతో గరిష్టానికి చేరుకోగా, ముంబైలో రూ.111.43పై., డీజీల్​ ధర ఢిల్లీలో డీజీల్​ లీటర్​ ధర. రూ.94.22పై., ముంబైలో రూ.102.15పై.కు చేరుకుంది.

చెన్నైలో పెట్రోల్​ ధర102.70పైసలుగా, డీజీల్​ రూ. 98.59పైసలుగా ఉంది. అక్టోబర్​ 12, 13 తేదీల్లో పెట్రో రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులకు మళ్లీ హ్యాట్రిక్​ రోజుల పెంపు కంగారుపుట్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్‌ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు.


చదవండి: గ్యాస్‌ సిలిండర్‌ పేలుళ్లు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సురక్షితం

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు