సెంచరీ దాటేసిన పెట్రోలు: ఏయే రాష్ట్రాల్లో?

14 May, 2021 17:22 IST|Sakshi

పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు వినియోగదారులకు చుక్కలే!

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్  రాష్ట్రాల్లో సెంచరీ క్రాస్‌

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు  మళ్లీ పెరిగాయి. మే 4 నుండి పెరుగుతూ వస్తున్న ధరలు  శుక్రవారం ఎనిమిదవసారి తిరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.  శుక్రవారం పెట్రోలుపై 29 పైసలు,  డీజిల్ ధరలు 34 పైసలు పెరిగాయి.  తాజా పెంపుతో  కొన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్  ధరలు రూ.100 దాటేశాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్  రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరుకు 100 రూపాయలను దాటేసింది. ముంబైలో పెట్రోల్  ధర లీటరుకు రూ .100 లకు చేరువలో ఉంది.  ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 92.34 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర లీటరుకు 82.95 రూపాయలు పలుకుతోంది. ఈ నెల 4 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ..1.94, డీజిల్‌పై రూ.2.22 పెరిగింది. 

ముంబైలో పెట్రోల్ ధరరూ .98.65, డీజిల్‌రూ .90.11 
చెన్నైలో  పెట్రోల్ ధర రూ .94.09 రూ .87.81 .
కోల్‌కతాలో రూ .92.44 కు లీటరుకు రూ .85.79 

అమరావతిలో పెట్రోలు ధర రూ. 98.49, డీజిల్‌ ధర రూ. 92.39
హైదరాబాబాదులో పెట్రోలు ధర రూ. 95.97,డీజిల్‌ ధర రూ. 43


పెట్రోల్ 100 రూపాయలు దాటిన రాష్ట్రాలు
మహారాష్ట్రలోని పర్భాని ప్రాంతంలో పెట్రోల్ లీటరుకు రూ .101, మధ్యప్రదేశ్‌లోని రేవాలో  రూ .102.69, రాజస్థాన్‌లో గంగానగర్‌లో పెట్రోల్ ధర లీటరుకు 103.28 రూపాయలుగా ఉంది.

మరిన్ని వార్తలు