సామాన్యులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

28 Sep, 2021 15:04 IST|Sakshi

న్యూఢిల్లీ: రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్యుడు బతుకు జీవుడా అంటూ బతుకు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకి పెరిగి పోతున్న ఈ ధరల వల్ల సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరలు 20 పైసలు పెరగగా, డీజిల్ మంగళవారం 25 పైసలు పెరిగింది. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.39కు చేరుకుంది. దేశ రాజధానిలో ఒక లీటర్ డీజిల్ ను రూ.89.57కు విక్రయిస్తున్నారు. 

భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.107.47, డీజిల్ ధర లీటరుకు రూ.97.21గా ఉన్నాయి. గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్‌ ధరలు పెరగడం ఇది తొలిసారి కాగా.. డీజిల్‌ ధరలు నాలుగోసారి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల గరిష్ఠానికి చేరాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగి పోతున్నాయి. దీంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ 17 సెంట్లు లేదా 0.2 శాతం తగ్గి 79.36 డాలర్లకు చేరుకుంది. కరోనా మహమ్మారి భయాలు తగ్గడం, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని క్రమ క్రమంగా తొలిగించడంతో ఇంధన ధరలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది.(చదవండి: 35వేల కోట్ల జరిమానా సరే! యాపిల్‌ సంగతేంది?)

దేశంలోని ప్రధాన నగరాల్లో లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌ ధరలు..

City Name  Petrol Price   Diesel Price
హైదరాబాద్‌  105.48  97.46
విజయవాడ  107.54   99.25 
విశాఖపట్నం  106.77  98.51
 ఢిల్లీ  101.39   89.57
ముంబై   107.47   97.21
 బెంగళూరు   104.92  95.06
 చెన్నై    99.15  94.17

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు