పెట్రో సెగ: మరోసారి సెంచరీ కొట్టిన పెట్రోలు

7 May, 2021 15:46 IST|Sakshi

వరుసగా నాలుగో రోజు పెరిగిన ధరలు

పెట్రోల్  లీటరుకు 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలు  పెంపు

ఏడాదిలో రెండోసారి 100 మార్క్‌ దాటేసిన పెట్రోలు

సాక్షి, ముంబై: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహన దారులకు చుక్కలు  చూపిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలు చొప్పున పెంచుతూ చముర కంపెనీలు నిర్ణయించాయి. తాజా పెంపుతో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో  లీటరు పెట్రోలు ధర మరోసారి సెంచరీ కొట్టింది. దేశంలో పెట్రోలు ధర రూ.100 మార్కును  దాటడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో మొదటిసారి 100  రూపాయలను దాటి వాహన దారులను బెంబేలెత్తించింది. 

రాజస్థాన్ శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్ లీటరుకు రూ .102.15 ను తాకింది.  ఇక్కడ డీజిల్ రేటు రూ .94.62 గా ఉంది. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ .101.86 వద్ద ఉండగా,  లీటరు డీజిల్ రేటు రూ. 92.90గా ఉంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటరుకు 102 రూపాయలను తాకడం గమనార్హం. 
 
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్‌ ధర లీటరుకు
ఢిల్లీలో పెట్రోల్   రూ. 91.27,  డీజిల్  రూ. 81.73 
ముంబైలో పెట్రోల్  రూ .97.61, డీజిల్  రూ .88.82 
కోల్‌కతాలో పెట్రోల్  రూ .91.41, డీజిల్  రూ .84.57
చెన్నైలో పెట్రోల్  రూ .93.15, డీజిల్  రూ .86.65

హైదరాబాద్‌లో పెట్రోల్  రూ .94.86, డీజిల్  రూ .89.11
అమరావతిలో పెట్రోల్  రూ .97.42 డీజిల్  రూ .91.12
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు