దేశంలో పెట్రో ధరలు, వాహనదారులకు ఊరట

25 Jul, 2021 09:35 IST|Sakshi

కరోనా కారణంగా ఆర్థిక మాంద్యం తలెత్తిన వేళ దేశంలో చమురు వాహనదారులకు ఊరట కలిగిస్తున్నాయి. గత ఆదివారం నుంచి ఈ రోజు(ఆదివారం) వరకు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్ ధరలు 39 సార్లు పెరగ్గా అదే సమయంలో డీజిల్ రేట్లు 36 సార్లు పెరిగాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్రో రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

ఇక ఆదివారం రోజు పెట్రోల్‌ ధరల వివరాలు
హైదరాబాద్‌ లో పెట్రోల్‌ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది
ముంబై లీటర్‌ పెట్రోల్‌ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది
ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది
చెన్నైలో పెట్రోల్‌ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది
కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది
బెంగళూరు లో పెట్రోల్‌ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది

మరిన్ని వార్తలు