వాహనదారులకు ఊరట : దిగొచ్చిన పెట్రోలు ధర 

24 Mar, 2021 08:54 IST|Sakshi

24 రోజులు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు

పెట్రోలుపై 18 పైసలు, డీజిల్‌పై 17 పైసలు తాజా తగ్గింపు

సాక్షి, న్యూఢిల్లీ:  ఇటీవలి కాలం దాకా వాహనదారులకు చుక్కలు  చూపించిన ఇంధన ధరలు దిగి వచ్చాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు  పడిపోవడంతో దేశీయంగా  పెట్రోల్, డీజిల్  ఊరటనిస్తున్నాయి. వరుసగా 24 రోజులు స్థిరంగా  ఉన్న  పెట్రోలు ధర నేడు (మార్చి 24 బుధవారం)  లీటరుకు18 పైసలు,డీజిల్‌పై  17 పైసలు చొప్పున  తగ్గాయి.  ఫిబ్రవరి 27 న  పెట్రోలు ధర దేశ రాజధానిలో 91.17 వద్ద ఆల్ టైమ్ హైని తాకిన సంగతి తెలిసిందే.  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర.91.17 నుండి. 90.99 కు , డీజిల్ 17 పైసలు తగ్గి లీటరుకు. 81.47 నుండి. 81.30కు చేరింది.

వివిధ నగరాల్లో పెట్రోల్  డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి
ముంబైలో  పెట్రోలు ధర రూ.  97.40 డీజిల్‌ ధర 88.42
చెన్నైలో పెట్రోలు ధర 92.95  డీజిల్‌ ధర86.29
కోల్‌కతాలో పెట్రోలు ధర  91.18  డీజిల్‌ ధర 84.18

హైదరాబాద్‌లో‌ పెట్రోల్ ధర రూ.94.61 , డీజిల్ ధర రూ.88.67 
అమరావతిలో పెట్రోల్ ధర రూ.97.14 , డీజిల్ ధర రూ.90.67 

కాగా ముడి చమురు ధరలు దాదాపు రెండు వారాల నుంచి సుమారు 10 శాతం తగ్గాయి.  అయితే బుధవారం  మాత్రం పైకి చూస్తున్నాయి. బ్రెంట్ ముడి ఫ్యూచర్స్ 27 సెంట్లు లేదా 0.4 శాతం పెరిగి,  బ్యారెల్ 61.06 డాలర్లకు చేరుకుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) ముడి ఫ్యూచర్స్ 19 సెంట్లు లేదా 0.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.95 డాలర్లకు చేరుకుంది.

మరిన్ని వార్తలు