పెరిగిన పెట్రోల్‌ ధర .. మరి డీజిల్‌ ?

5 Jul, 2021 10:35 IST|Sakshi

ముంబై: వరుసగా మూడో రోజు పెట్రోల్‌ ధర పెరిగింది. లీటరు పెట్రోలుపై రూ. 37 పైసల ధర పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే డీజిల్‌ ధర పెంచలేదు. తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్  రూ103.84; డీజిల్‌ రూ.97.46 పైసలకు చేరుకుంది. 

ప్రతీ రోజు
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలకు అనుగుణంగా ఇంధన ఛార్జీలు సవరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత... మొదట్లో సగటున ప్రతీ పదిహేను రోజులకు ఓసారి పెట్రోలు ధర పెరిగేది. ఆ తర్వాత వారానికి పడిపోయింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంచుమించు రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇక జులైలో అయితే ఒక్క రోజు గ్యాప్‌ ఇచ్చి దాదాపు ప్రతీ రోజు పెట్రోలు ధర పెరిగింది.

పెట్రోలుపై రూ. 9.49 పెంపు
ఈ ఏడాది మే 4 నుంచి పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 36 సార్లు పెట్రోలు ధరను పెంచుతూ పోయారు. మొత్తంగా రెండు నెలల కాలంలో లీటరు పెట్రోలుపై రూ. 9.49 ధరను పెంచారు. అయితే ఈ సారి డీజిల్‌ ధరలు పెంచకుండా స్వల్ప ఉపశమనం కలిగించాయి చమురు కంపెనీలు. పెట్రోలు ధర పెరుగుడుకు కళ్లెం వేయాలంటూ ఇక్రా వంటి సంస్థలు సూచించినా ఇటు చమురు సంస్థలు, అటు కేంద్రం నుంచి స్పందన లేదు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు