Petrol Price : మేలో 14 సార్లు, జూన్‌లో 16 సార్లు.. మరి జులైలో ?

3 Jul, 2021 11:15 IST|Sakshi

ముంబై : పెట్రోలు ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌లపై ఆరు పైసల వంతున ధర పెంచాయి చమురు కంపెనీలు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటి వరకు 60 రోజుల్లో 34 సార్లు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి.

34 సార్లు
బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఎన్నికల హడావుడి కొనసాగినన్నటి రోజులు దాదాపు రెండు నెలలుగా పెట్రోలు ధరలు పెరగలేదు. కానీ మే మొదటి వారంలో ఫలితాలు వెలువడిన అనంతరం పెట్రోలు ధరలు అనూహ్యంగా పెరుగుతూ పోయాయి. ఇప్పటి వరకు 60 రోజుల్లో 34 సార్లు పెట్రోలు ధరలు పెరిగాయి. ఇందులో జులైలో ఇప్పటికే రెండు సార్లు ధరలు పెరగగా జూన్‌లో 16 సార్లు, మేలో 14 సార్లు పెట్రోలు,  డీజిల్‌ ధరలను పెంచాయి చమురు కంపెనీలు. 

పెట్రోలుపై రూ. 8.82 పెంపు
ఈ ఏడాది మే 4 నుంచి పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 34 సార్లు పెట్రోలు ధరను పెంచుతూ పోయారు. మొత్తంగా రెండు నెలల కాలంలో లీటరు పెట్రోలుపై రూ. 8.82 ధరను పెంచారు. ఇదే సమయంలో డీజిల్‌ ధర లీటరుకు రూ. 8.51 పెరిగింది. తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్  రూ103.11; డీజిల్‌ రూ.97.26 పైసలకు చేరుకుంది. 

చదవండి : New IT Rules: ఫేస్‌బుక్ పోస్టులపై భారీ వేటు

మరిన్ని వార్తలు