వరుసగా ఏడో రోజు.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

11 Oct, 2021 10:40 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుతుండటంతో నేరుగా ఆ భారం వినియోగదారుడిపై మోపుతున్నాయి దేశీ చమురు సంస్థలు. లీటరు డీజిల్‌పై 30 పైసలు, లీటరు పెట్రోలు 37 పైసల వంతున ఛార్జీలు పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఏడు రోజులు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 108.60 లీటరు డీజిల్‌ ధర రూ.101.62లకు చేరుకుంది. 

చేతులెత్తేసిన చమురు సంస్థలు
చమురు ఉత్పత్తిపై ఒపెక్‌ దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి దేశ ప్రజలపై పెట్రోలు భారం పడకుండా చర్యలు తీసుకోవడంలో చమురు సంస్థలు విఫలమవుతున్నాయి. మరోవైపు కేంద్రం సైతం చమురు సంస్థలు ఎడాపెడా ఛార్జీలు పెంచుతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి తప్పితే, ధరాఘాతం నుంచి సామాన్యలను రక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

నవంబర్‌ వరకు
నవంబర్‌ వరకు ముడి చమురు ధరలు పెరుగాయని ఒపెక్‌ దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇటు కేంద్రం, అటు చమురు సంస్థలు ఈలోగా ఏమైనా ఉపశమనం చర్యలు తీసుకోకుంటే చమురు ధరలు భరించలేని స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది.


 

మరిన్ని వార్తలు