రాష్ట్రాలు అందుకు ఒప్పుకోవు...! కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి

23 Sep, 2021 21:15 IST|Sakshi

ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామన్యుడికి చుక్కలు కన్పిస్తున్నాయి. గత పదిహేను రోజుల నుంచి ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. కాగా తాజాగా పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి ఇంధన ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎందుకు దిగిరావడంలేదంటే... పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్‌టీలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు ఒప్పుకోవని వెల్లడించారు. పెట్రోలు, డీజిల్‌ జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చే అంశంపై  రాష్ట్రాలు సిద్దంగా లేవని మీడియాతో తెలిపారు.  
చదవండి: జేమ్స్‌బాండ్‌-007 భాగస్వామ్యంతో స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌..! 

పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న హర్‌దీప్‌ సింగ్‌పురి టీఎమ్‌సీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టీఎమ్‌సీ ప్రభుత్వం భారీగా పన్నులను మోపడంతో పశ్చిమబెంగాల్‌లో పెట్రోల్‌ రూ. 100 మార్క్‌ను దాటిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా  అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎమ్‌సీ) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

చదవండి: పవర్‌ఫుల్‌ పర్ఫార్మెన్స్‌తో మార్కెట్లలోకి నయా డుకాటీ మాన్‌స్టర్...! 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు