పెట్రో ధరలు భగ్గు

22 Jan, 2021 10:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి.  దీంతో  శుక్రవారం ఆకాశాన్ని తాకిన పెట్రో ధరలు  దేశీయంగా  సరికొత్త రికార్డును తా​కాయి.  వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో  లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 25 పైసలు చొప్పున  పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి.  తాజా పెంపుతో పెట్రోలు ధర  రికార్డు స్థాయికి చేరింది. దీంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైలో పెట్రో  92 రూపాయల వద్ద రికార్డు హైకి చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.45 వద్ద రికార్డును సృష్టించింది. ఢిల్లీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక రేటు.  ఇక్కడ లీటరు డీజిల్‌ ధర రూ. 75.63గా ఉంది.    

ముంబైలో పెట్రోలు ధర  లీటరుకు రూ.  92.04 డీజిల్‌ ధర రూ. 82.40
చెన్నైలో పెట్రోలు ధర  లీటరుకు రూ. 88.07 డీజిల్‌ ధర రూ.80.90
కోలకతాలో పెట్రోలు ధర  లీటరుకు రూ. 86.87 డీజిల్‌ ధర రూ.79.23

అమరావతి  పెట్రోలు ధర  లీటరుకు రూ. 91.68, డీజిల్‌ ధర రూ.84.84. 
హైదరాబాద్‌లో పెట్రోలు ధర  లీటరుకు రూ. 88.89, డీజిల్‌ ధర రూ.82.53

మరిన్ని వార్తలు