Provident Fund Tax Rules: ఈపీఎఫ్‌ చందాదారులకు షాక్‌.. కొత్త రూల్స్‌ ఇవే!

16 Jul, 2022 17:13 IST|Sakshi

Provident Fund Tax Rules: బడ్జెట్ ప్రతిపాదనలో భాగంగా ఎంప్లాయిస్​ ప్రావిడెంట్ ఫండ్​ (ఈపీఎఫ్​ఓ) నిబంధనలల్లో కేంద్ర ఆర్థిక శాఖ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులు ప్రకారం.. ఏప్రిల్ 1, 2022 నుంచి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు రెండు రకాలుగా విభజించారు. ఒకటి పన్ను విధించేవి, మరొకటి పన్ను మినహాయింపు ఖాతాలు

అంతేకాకుండా ప్రావిడెంట్‌ ఫండ్‌ వడ్డీరేటును 8.1 శాతానికి పరిమితం చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఏడాది ఈ వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది. గడిచిన నలభై ఏళ్లలో కూడా ఇదే అత్యల్ప వడ్డీరేటు. అయితే ఈ నిర్ణయం మాత్రం ఈపీఎఫ్‌ఓ చందాదారులకు షాక్‌ అనే చెప్పాలి.

ఈపీఎఫ్​ఓ చందాదారులు ఇవి తప్పక తెలుసుకోవాలి..!

►పీఎఫ్‌ FY 2021-22కి గాను వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించింది. చివరి సారిగా 1977-78లో పీఎఫ్‌ వడ్డీరేటు 8 శాతంగా ఉండేది. నలభై నాలుగేళ్ల తర్వాత ఇంచుమించు అదే స్థాయికి వడ్డీరేటు చేరింది.

►ఈపీఎఫ్​ఓ చందాదారుల వాటా.. వార్షికంగా రూ.2.5 లక్షలు దాటితే వారంతా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

►ఉద్యోగులు వాటా వార్షికంగా రూ.2.5 లక్షల కన్నా తక్కువగా ఉంటే.. వారిపై పన్ను భారం ఉండదు.

►ఒక యజమాని ఉద్యోగి ఈపీఎఫ్‌కి నగదు జమ చేయకపోతే (contribution threshold) కాంట్రిబ్యూషన్ థ్రెషోల్డ్ ₹ 5 లక్షలకు పెంచనున్నారు.

►కాంట్రిబ్యూషన్ థ్రెషోల్డ్ పెంచిన అనంతరం..  అదనంగా పెంచిన నగదుపై మాత్రమే పన్ను విధిస్తారు, మొత్తానికి కాదు.

►ఉద్యోగి ఖాతాలో జమ అయ్యే నగదు, దానిపై వచ్చే వడ్డీ ఈపీఎఫ్‌లో ప్రత్యేక అకౌంట్‌లో నిర్వహించనున్నారు.

►యజమానులు(Accruals) అక్రూవల్స్ ఆధారంగా పన్నులను నిలిపివేస్తారు కాబట్టి, ఈ వివరాలను తప్పనిసరిగా ఫారమ్ 16, ఫారమ్ 12BAలో నింపాలి.

►నెలవారీ ఆదాయం ₹ 15,000 వరకు ఉన్న ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాలో యజమానులు తప్పనిసరిగా ఈపీఎఫ్‌ నగదు జమ చేయాల్సి ఉంటుంది.

చదవండి: విమానయాన సంస్థలకు భారీ ఊరట

మరిన్ని వార్తలు