8 డాలర్ల కోసం ఎలాన్‌ మస్క్‌ కక్కుర్తి.. దిగ్గజ సంస్థకు 1.20 లక్షల కోట్లు నష్టం!

13 Nov, 2022 14:20 IST|Sakshi

ట్విటర్‌లో ఎలాన్‌ మస్క్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలకు శాపంగా మారుతున్నాయి. 8 డాలర్లు సబ్‌స్క్రిప్షన్‌ దెబ్బకు లక్షల కోట్లు నష్టపోతున్నాయి. 

అమెరికాకు చెందిన కల్నల్‌ ఎల్లీ లిల్లీ  1861 – 1865 మధ్య కాలంలో జరిగిన అమెరికా సివిల్‌ వార్‌ సమయంలో డ్రగ్స్‌ తయారీ (pharmaceutical chemist ) నిపుణులుగా పనిచేశారు. అయితే 1876లో ఆయన తన పేరుమీద ‘ఎలీ లిల్లీ అండ్‌ కంపెనీ’ పేరుతో ఫార్మా కంపెనీని ప్రారంభించారు. ఆ సంస్థ ఇప్పుడు 18 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 125 దేశాలకు పైగా డయాబెటిస్‌ బాధితులు ఆ సంస్థ తయారు చేసిన డయాబెటీస్‌ మెడిసిన్‌ను వినియోగిస్తున్నారు. 

 అయితే ఇప్పుడు అదే సంస్థ ఎలాన్‌ మస్క్‌ కక్కుర్తితో చేసిన పనికి సుమారు రూ.1.20 లక్షల కోట్లు నష్టపోయింది. 8 డాలర్లు చెల్లిస్తే ట్విటర్‌ బ్లూటిక్‌ పొందండి’ అంటూ మస్క్‌ ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో కేటుగాళ్లు 8డాలర్లు చెల్లించి బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ బ్యాడ్జీని తీసుకున్నారు. అనంతరం ఎలీ లిల్లీ అండ్‌ కంపెనీ అఫీషియల్‌ ట్విటర్‌ అకౌంట్‌ పేరుతో.. ‘ఇన్సులిన్‌ను ఉచితంగా ఇస్తున్నాం అని ప్రకటించినందుకు సంతోషిస్తున్నాం’ అని ట్వీట్‌ చేసింది.

వెంటనే ఎలీ లిల్లీ తన అఫీషియల్‌ అకౌంట్‌ నుంచి వివరణ ఇచ్చింది. ఫ్రీ ఇన్సులిన్‌ పేరుతో వైరల్‌ అవుతున్న ట్వీట్‌ తమ సంస్థది కాదని, ఫేక్‌ అకౌంట్‌ నుంచి ఆ ట్వీట్‌ వచ్చిందని తెలిపింది. కానీ అప్పటికే పరిస్థి చేయిదాటిపోయింది. ఆ సంస్థ షేరు 368 డాలర్ల నుంచి 345 డాలర్లకు పడిపోయింది.

చదవండి👉 ‘ట్విటర్‌లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్‌ అగర్వాల్‌ ట్వీట్‌ వైరల్‌

మరిన్ని వార్తలు