రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌: ఫోన్‌ఫే కో-ఫౌండర్లు పెట్టుబడులు

10 Oct, 2022 15:23 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఫిబ్రవరి 2022లో నిర్వహించిన అద్భుత విజయం సాధించిన తరువాత, భారతదేశ వ్యాప్తంగా ఈ క్రీడ పట్ల అసాధారణ ఆసక్తి కూడా పెరిగింది. ఈ లీగ్‌ రెండవ సీజన్‌ సమీపిస్తోన్న వేళ రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ పవర్డ్‌ బై ఏ23 ఇప్పుడు మరింతగా  విస్తరిస్తోంది. తాజాగా ప్రముఖ దేశీయ డిజిటల్‌ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే సహ వ్యవస్థాపకులు రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో భారీ పెట్టుబడులు పెట్టారు. 8వ ఫ్రాంచైజీ- ముంబై మీటార్స్‌ను ఫ్రాంచైజీని చేజిక్కుంచుకున్నారు. అలాగే భారత వాలీబాల్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ అభిజిత్‌ భట్టాచార్య  నూతన ముంబై మీటార్స్‌  జీఎంగా  చేరారని ఫోన్‌పే  ఫౌండర్లు ఒక ప్రకటనలో తెలిపారు.

వాలీబాల్‌ క్రీడాకారుడిగా వాలీబాల్‌ ఆట ఆనందం గురించి తనకు తెలుసునని రూపే పీవీఎల్‌ తమకు ఖచ్చితమైన అవకాశాన్ని ప్రొఫెషనల్‌ మార్గంలో ప్రపంచశ్రేణి స్ధాయిలో  నిర్మించే అవకాశం అందిస్తుందని భావిస్తున్నామంటూ  కోఫౌండర్‌ సమీర్‌ నిగమ్‌ సంతోషం వెలిబుచ్చారు. భారతీయ క్రీడా వ్యవస్థ అత్యంత ఉత్సాహ పూరిత మైందనీ, ముఖ్యంగా క్రికెటేతర రంగంలో అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్న రంగంలో తగిన తోడ్పాటునందించేందుకు రూపే పీవీఎల్‌ తమకు గొప్ప అవకాశంగా భావిస్తున్నామని మరో కో ఫౌండర్‌ రాహూల్‌ చారి తెలిపారు. రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ సీఈఓ జాయ్‌ భట్టాచార్య మాట్లాడుతూ అత్యంత గౌరవనీయమైన కార్పోరేట్‌ లీడర్లు సమీర్‌, రాహుల్‌లు ఫ్రాంచైజీ యజమానులుగా చేరడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ముంబై ఫ్రాంచైజీ యజమానులును స్వాగతించిన థామస్‌ ముత్తూట్‌, యజమాని, కొచి బ్లూ స్పైకర్స్‌ మాట్లాడుతూ వారి వ్యాపార అనుభవం, ఈ క్రీడ పట్ల అభిరుచి రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌కు తోడ్పడుతుందనిపేర్కొన్నారు. 

రెండో సీజన్‌ 2023 సంవత్సరారంభంలో ప్రారంభమవుతుందని అంచనా. వాలీబాల్‌ అంతర్జాతీయ సంస్ధ (ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డీ వాలీబాల్‌, ఎఫ్‌ఐవీబీ)కు వాణిజ్య విభాగం, వాలీబాల్‌ వరల్డ్‌ ఇప్పుడు పీవీఎల్‌తో చేతులు కలపడంతో పాటుగా పలు సంవత్సరాల పాటు అంతర్జాతీయ స్ట్రీమింగ్‌ భాగస్వామిగా వ్యవహరించనుంది. సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ హోస్ట్‌ బ్రాడ్‌కాస్టర్‌గా కొనసాగనుంది. ఈ లీగ్‌కు మొత్తం 133 మిలియన్‌ల టెలివిజన్‌ వ్యూయర్‌షిప్‌ ఉంది. ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలలో కామెంట్రీ ఎంచుకునే అవకాశమూ అందించింది.

మరిన్ని వార్తలు