ఫోన్‌పే యూజర్లకు అలర్ట్‌: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా!

12 Nov, 2022 16:06 IST|Sakshi

ఫోన్‌పే(Phone Pay) .. డిజిటల్‌ లావాదేవీలు పెరిగినప్పటి నుంచి ఈ పేరు బాగా పాపలర్‌ అయిపోయింది. పర్సలో మనీ లేకపోయినా పర్లేదు ఫోన్‌లో ఫోన్‌పే ఉంటే చాలు అనుకునేంతగా ప్రజాదారణ పొందింది ఈ యాప్‌. ప్రస్తుతం 350 మిలియన్ల మంది రిజిస్టర్డ్‌ కస్టమర్లతో పలు సేవలు అందిస్తూ భారత్‌లో దూసుకుపోతుంది ఫోన్‌పే. ఎప్పటికప్పడు కొత్త సేవలో కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి సంఖ్యను పెంచుకుంటున్న ఈ యాప్‌ తాజాగా మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

సరికొత్త సేవల మీ కోసం..
ఇది వరకు ఫోన్‌పే ఉపయోగించాలంటే తప్పనిసరిగా మన డెబిట్‌ కార్డుతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డెబిట్‌ కార్డు అవసరం లేకుండా సరికొత్త సేవలను ఫోన్‌పే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారుడు కేవలం ఆధార్‌ కార్డు ఉపయోగించి యూపీఐ సేవలు పొందవచ్చని ఫోన్‌ పే తెలిపింది. ఇకపై ఫోన్‌ పేలో మీ డెబిట్‌ కార్డ్‌ అవసరం లేకుండా కేవలం మీ ఆధార్ కార్డ్ ద్వారా ఫోన్‌పేలో మీ యూపీఐ (UPI)ని సెటప్ చేయాలనుకుంటే, సింపుల్‌గా ఇలా ఫాలో అవ్వండి.

►ముందుగా ప్లేస్టోర్‌ (PlayStore) లేదా యాప్‌ స్టోర్‌( App Store) నుంచి ఫోన్‌పేని డౌన్‌లోడ్ చేసుకోండి.
►ఆపై ఓపెన్‌ చేసి మీ మొబైల్ నంబర్‌ని యాడ్‌ చేయండి, తర్వాత OTP వస్తుంది దాని ఎంటర్‌ చేయండి.
►ఇప్పుడు మై మనీ పేజీకి వెళ్లి, ఆపై పేమెంట్స్‌ మెతడ్స్‌ (payments method)పై క్లిక్ చేయండి.
►తర్వాత మీ బ్యాంక్‌ని ఎంచుకోని,  'Add New Bank Account'పై క్లిక్ చేయండి.
► మీ బ్యాంక్‌ని సెలక్ట్‌ చేసుకుని, మీ ఫోన్ నంబర్‌ని ధృవీకరించాల్సి ఉంటుంది.


►దీంతో ఫోన్‌పే మీ ఖాతా వివరాలను యాక్సెస్‌ పొందుతుంది, వీటితో పాటు మీ అకౌంట్‌ యూపీఐకి లింక్ అవుతుంది.
►తర్వాత  మీ డెబిట్/ఏటీఎం కార్డ్ వివరాలను నమోదు చేయవచ్చు లేదా ఆధార్ కార్డ్ ఎంపికను ఎంచుకోవచ్చు.
►మీ ఆధార్‌లోని చివరి ఆరు అంకెలను నమోదు చేయండి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
► OTPని ఎంటర్‌ చేసి ఆపై మీ యూపీఐ పిన్ నెంబర్‌ సెట్‌ చేసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. 

చదవండి: ణుకుతున్న ఉద్యోగులు.. డిసెంబర్‌ నాటికి మాంద్యంలోకి ఆ దేశాలు!

మరిన్ని వార్తలు