చెన్నైలో పియాజియో తొలి ఎలక్ట్రిక్ వాహన అవుట్ లెట్

26 Sep, 2021 20:17 IST|Sakshi

చెన్నై: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నైలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహన అవుట్ లెట్ ఏర్పాటు చేసింది. తమిళనాడు వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎం.ఎ.సుబ్రమణియం ఈ ఎక్స్ పీరియన్స్ సెంటర్(ఈవీ షోరూమ్) ప్రారంభించారు. పియాజియో ఎలక్ట్రిక్ వాహనాలను ఈ ఈవీ షోరూమ్ లో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు అని అన్నారు."చెన్నైలో తమిళనాడులో మా మొదటి ఈవీ ప్రత్యేక షోరూమ్ ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. చెన్నై ఒక పెద్ద మెట్రో & ప్రధాన వ్యాపారలకు కేంద్రంగా ఉంది" అని ఈవీపీ, కమర్షియల్ వేహికల్ బిజినెస్ హెడ్, పియాజియో ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సాజు నాయర్ అన్నారు. 

చెన్నై తరువాత, కంపెనీ తమిళనాడులోని ఇతర నగరాలలో ఈవీని విస్తరించాలని చూస్తున్నట్లు నాయర్ తెలిపారు. పియాజియో ఇటీవల కార్గో, ప్యాసింజర్ సెగ్మెంట్లలో ఈవీల ఎఫ్ఎక్స్ రేంజ్(ఫిక్సిడ్ బ్యాటరీ)ని లాంఛ్ చేసింది. ఈ కొత్త ఉత్పత్తులు కొత్త చెన్నై అవుట్ లెట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. "పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాలపై తమిళ నాడు ప్రభుత్వం దృష్టి సారించడంతో, ఈవీ వాహనాలు భవిష్యత్తులో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉండబోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి & మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందడానికి మా కొత్త ఈవీ విధానం రూపొందించబడింది" అని సుబ్రమణియం తెలిపారు.(చదవండి: జేమ్స్‌ బాండ్‌కు శ్రీరామరక్ష ఏదో తెలుసా?)

మరిన్ని వార్తలు