Wikipedia:హ్యాక్‌..! లిస్ట్‌లో టాప్‌ సెలబ్రిటీలు..!

17 Aug, 2021 18:57 IST|Sakshi

ప్రముఖ వెబ్‌సైట్‌ వికీపీడియా సోమవారం రోజున హ్యాకింగ్‌కు గురైనట్లు వార్తలు వస్తోన్నాయి. డజన్ల కొద్దీ వికీపీడియా పేజీలు సోమవారం ఉదయం స్వస్తిక్(జర్మన్ నాజీ పార్టీ జెండా) చిత్రాలతో తాత్కాలికంగా భర్తీ చేయబడినట్లు తెలుస్తోంది. వికీపీడియా పేజీలను ఒపెన్‌ చేస్తుంటే జర్మన్‌ నాజీ పార్టీ జెండాలు కన్పించాయని యూజర్లు తెలిపారు. చాలా మేరకు ప్రముఖుల వికీపీడియా పేజీలు హ్యాకింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్)

హ్యాకింగ్‌కు గురైన వికీపీడియా పేజీల్లో హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, సింగర్స్‌ ఉన్నారు. జెన్నిఫర్‌ లోపెజ్‌, బెన్‌ ఆఫ్లెక్‌, మడోన్నా వికీపీడియా పేజీల్లో ఎరుపు వర్ణంలోని జర్మన్‌ నాజీ పార్టీ జెండా స్వస్తిక్‌ గుర్తు కన్పించిందని కొత్త మంది యూజర్లు సోషల్‌ మీడియాలో వెల్లడించారు. అంతేకాకండా జర్మన్ తత్వవేత్త థియోడర్ అడోర్నో,  జోసెఫ్ స్టాలిన్ పేజీలు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది.

వికీపీడియాను ఎలాంటి లాభాపేక్షలేకుండా వికీమీడియా ఫౌండేషన్‌ నిర్వహిస్తోంది. కాగా హ్యాకింగ్‌పై వికీమీడియా ఫౌండేషన్‌ ప్రతినిధి మాట్లాడుతూ..ప్రముఖ స్టార్స్‌, సింగర్స్‌ వికీపీడియా పేజీల్లో కొద్ది క్షణాలపాటు జర్మన్‌ నాజీ పార్టీ జెండా కన్పించినట్లు నిర్థారించారు. కాగా వికీపీడియా వెబ్‌సైట్లపై జరిగిన హ్యాకింగ్‌ను వీకీమీడియా ఫౌండేషన్‌ ప్రతినిధులు కేవలం ఐదు నిమిషాల్లో  తిప్పికొట్టిన్నట్లు వెల్లడించారు.  (చదవండి: తాలిబన్లకు భారీ షాకిచ్చిన ఫేస్‌బుక్‌..!)

>
మరిన్ని వార్తలు