2047 నాటికి సంపన్న దేశంగా భారత్‌,‘బ్రాండ్‌ ఇండియా’నే లక్క్ష్యంగా

7 Oct, 2022 08:12 IST|Sakshi

న్యూఢిల్లీ: అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశ్రమకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ సూచించారు. తద్వారా 2047 నాటికి భారత్‌ సంపన్న దేశంగా ఎదిగేలా ’బ్రాండ్‌ ఇండియా’ను నిర్మించడంలో తోడ్పడాలని పేర్కొన్నారు.

 క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (క్యూసీఐ)కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన వివిధ నియంత్రణ సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. 

మరోవైపు, మరింత మంది మహిళలు చార్టర్డ్‌ అకౌంటెన్సీ ప్రొఫెషన్‌ను ఎంచుకోవాలని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గోయల్‌ సూచించారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో పోటీపడేలా భారతీయ సీఏ సంస్థలను తీర్చిదిద్దేందుకు ఐసీఏఐ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు