Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు బంగారం కొంటున్నారా? అయితే ఇది మీ కోసమే!

3 May, 2022 13:59 IST|Sakshi

భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం..సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడు పరమేశ్వరుణ్ని ప్రార్ధించగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చిన్నట్లు చెబుతుంది. 

మన పెద్దలు సైతం లక్ష్మీ దేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని చెబుతుంటారు. అందుకే ఈ పర్వదినం సందర్భంగా ఎవరి తాహతకు తగ్గట్లు వాళ్లు బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే కొనుగోలు దారులు బంగారం కొనే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు  చెబుతున్నారు. ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.    

మీరు బంగారం కొనడానికి ప్రయత్నించే ముందు దాని ప్రస్తుతం ధర ఎంతుందో తెలుసుకోవాలి. బంగారాన్ని పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తే కొంత మంది ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధర కాకుండా.. కాస్త ఎక్కువ చేసి చెపుతుంటారు. కాబట్టి బంగారం కొనే ముందు.. మార్కెట్‌లో ఆ బంగారం ధర ఎంత ఉందో తెలుసుకోవాలని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 

బంగారం కొనే సమయంలో.. బంగారం బరువు తూకం వేసే బాట్ల(వెయిట్స్‌)ను  చెక్‌ చేయండి. ఎందుకంటే ఆ తూకం యంత్రం సాయంతో తక్కువ బంగారం.. ఎక్కువగా ఉన్నట్లు చూపి మోసం చేస్తుంటారు. 

హాల్‌ మార్క్స్‌ వేసిన బంగారమా! కాదా అనేది చెక్‌ చేయండి. కస్టమర్ల ప్రయోజనాలు కాపాడేందుకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలుచేయడం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో. ఈ లోగోతో పాటు హాల్‌ మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌(హెచ్‌యూఐడీ)నెంబర్‌ అనే 6 అంకెల కోడ్‌ ఉంటుంది. 

మీరు పెట్టుబడి ప్రయోజనాల కోసం బంగారాన్ని కొనుగోలు చేయాలని అనుకున్నట్లైతే.. మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 10శాతం మించకుండా చూసుకోండి

చదవండి: బంగారం కొనుగోలు దారులకు శుభవార్త! కేంద్రం కీలక నిర్ణయం!

మరిన్ని వార్తలు