సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసే ముందు ఇవి తెలుసుకోండి!

3 Oct, 2021 21:09 IST|Sakshi

దేశంలో పెట్రోల్ ధరలు 100 రూపాయల దాటేసరికి వాహనదారులు తమ వాహనాన్ని బయటకు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది కొత్త వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. కరోనా మహమ్మరి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆటో పరిశ్రమకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇది ఇలా ఉంటే ఎలక్ట్రిక్ వాహనలకు డిమాండ్, అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా చాలా మంది వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సిద్దం అవుతున్నారు.(చదవండి: సరికొత్త మోసం.. ఇలాంటి లింక్ అస్సలు క్లిక్ చేయకండి!)

ప్యాసింజర్ వేహికల్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన ట్రెండ్ ఏమిటంటే, ప్రీ-ఓన్డ్ లేదా ఉపయోగించిన వాహనాలకు అధిక డిమాండ్ ఉంటుంది. దీని వెనుక కారణం కొత్త మోడల్స్ తో పోలిస్తే వాహనాలు సరసమైన ధరలకు వస్తాయి. అదే సమయంలో, పెద్దగా కొన్నవారికి కూడా ఎక్కువ నష్టం కలగదు. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరగడంతో ఈవీ ప్రీ-ఓన్డ్ వేహికల్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, సెకండ్ హ్యాండ్ లేదా ప్రీ-ఓన్డ్ ఎలక్ట్రిక్ వాహనాలను కొనేముందు కొన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

బ్యాటరీ జీవితకాలం
ఉపయోగించిన ఈవీని కొనుగోలు చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశం ఇది. బ్యాటరీ మంచి కండిషన్ తో ఉన్న ఈవీలు భాగ పనిచేస్తాయి. అయితే, ఉపయోగించిన ఐసీఈ వేహికల్ కొనుగోలు చేసేటప్పుడు మీరు చెక్ చేసినట్లుగా వీటి బ్యాటరీ జీవితకాలం, రేంజ్ వంటివి చెక్ చేయాలి. ఆ తర్వాత డీల్ గురుంచి మాట్లాడండి. బ్యాటరీ జీవితకాలం ఛార్జింగ్ టైప్, ఛార్జింగ్ ఫ్రీక్వెన్సీ, బ్యాటరీ ఏ స్థాయికి డ్రెయిన్ చేశారు వంటి కారకాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

ఫాస్ట్ ఛార్జింగ్ ఈవీల బ్యాటరీలు త్వరగా నష్టం వాటిల్లుతుంది. రెగ్యులర్ హోమ్ ఛార్జింగ్ సాకెట్ ఎక్కువ బ్యాటరీ జీవితకాలాన్ని ఇస్తుంది. బ్యాటరీని సున్నా నుంచి చార్జ్, ఎప్పుడు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ జీవిత కాలం ప్రభావితం చెందుతుంది. ఆ లీథియం ఆయాన్ బ్యాటరీ లేదా వేరే బ్యాటరీనా అని చూసుకోవాలి.  (చదవండి: డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు డౌన్‌లోడ్‌ చేశారా..?)

మైలేజ్ రేంజ్
ఈవీ రేంజ్ బ్యాటరీ సైజుపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ ఎంత పెద్దదిగా ఉంటే ఈవీ అంత ఎక్కువ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల, ప్రీ-ఓన్డ్ ఈవిపై డీల్ ఖరారు చేసే ముందు బ్యాటరీ సైజు, సగటు రేంజ్ గురించి ఎల్లప్పుడూ విచారించండి. ఎలక్ట్రిక్ వాహనం రేంజ్ సామర్థ్యం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది.

మౌలిక సదుపాయాల లభ్యత 
ఈవీ కొనుగోలు చేసే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో కీలకమైన అంశం. నగరం, చుట్టుపక్కల ఎక్కువగా ప్రయాణించడానికి ఈవీ కొనుగోలు చేసినట్లయితే ఎలాంటి సమస్య లేదు. ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటే రహదారుల వెంట ఎక్కువ ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్నాయో లేదా అనేది చూసుకోవాలి.(చదవండి: ఏటీఎం కార్డు లాంటి ఆధార్.. అప్లై ఇలా!)

కాలం
ఒక ఎలక్ట్రిక్ వాహనం తీసుకునే ఎన్ని ఏళ్లు అయ్యింది అనేది కూడా చాలా ముఖ్యం. ఇంధన వాహనాలతో పోలిస్తే తక్కువ లైఫ్ ఉంటాయి. నిర్వహణ ఖర్చులు పెద్దగా ఉండనప్పటికి బ్యాటరీ, ఇంజిన్ సమస్య వస్తే సాదారణ వాహనాలతో పోలిస్తే ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. వీటి జీవిత కాలం ఇంధన వాహనాలతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకే, కొనేముందు వారు తీసుకొని ఎన్ని ఏళ్లు అయింది అనేది తెలుసుకోవాలి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు