హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ప్లూరల్ టెక్నాలజీ వచ్చే మూడేళ్లలో 1,000 మంది టెక్నాలజీ కన్సల్టెంట్లను నియమించుకోనుంది. వీరిలో 500 మంది జపనీస్ భాషలో శిక్షణ పొందినవారై ఉండనున్నారని సంస్థ సీఈవో సునీల్ సవరం తెలిపారు.
(విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్! గతి స్టూడెంట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్)
ఇటీవలే సాంకేతిక సహకారాల కోసం జపాన్‌కు చెందిన ఓపెన్ సెసేమ్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన పేర్కొన్నారు. 2025 నాటికల్లా ఇరు సంస్థల ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ సర్వీసులు తదితర వ్యాపారాల ఆదాయం 100 మిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు.
(Jio offer: జియో అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!)