పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఈ సర్వీసులకు చార్జీలు చెల్లించాలి!

28 Nov, 2022 17:34 IST|Sakshi

మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ప్రయోజనాలను పొందుతున్నారా? అయితే ఈ అలర్ట్‌ మీకోసమే. ఈ స్కీంలో ఇప్పటికే లబ్ధిదారులు ఈకేవైసీ (eKYC) పూర్తి చేయాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఆపైనే లబ్దిదారులకు డబ్బులు కూడా అందుతాయని తెలిపింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం లబ్దిదారులు చేయనున్న ఈకేవైసీకి ఇకపై చార్జ్‌(రుసుము) చెల్లించాల్సి ఉంటుంది.

రుసుము తప్పనిసరి
డీబీటీ అగ్రికల్చర్ బీహార్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రయోజనం పొందే రైతులు అందరూ ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే స్కీమ్ ప్రయోజనాలు పొందలేరు. లబ్దిదారులు నేరుగా ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు లేదా మీ దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఇది పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆన్‌లైన్‌లో ఈకేవైసీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని భావిస్తే.. చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.

బయోమెట్రిక్ విధానంలో కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకున్నదానికి రుసుము రూ. 15గా ప్రభుత్వం నిర్ణయించింది. లేదంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా ఓటీపీ విధానంలో ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. దీనికైతే ఎలాంటి చార్జీలు ఉండవు.

ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ ఈకేవైసీ
►ముందుగా పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
►అందులో ఉన్న Pm Kisan Ekyc పై క్లిక్ చేయండి 
►అక్కడ మీ ఆధార్ నంబరుతో పాటు క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయండి
►మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయండి.
►అక్కడ ఉన్న సమాచారం ఆధార్‌తో సరిపోలితే మీ పీఎం కిసాన్ ఈకేవైసీ అప్‌డేట్ పూర్తవుతుంది.

చదవండి: రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు