ప్రధాని మోదీ ఫారిన్ టూర్ల ఖర్చు ఎంతో తెలుసా? 

2 Feb, 2023 18:53 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 నుంచి ఇప్పటి వరకు అయితే విదేశీ పర్యటనల ఖర్చు 22. 76 కోట్ల రూపాయలకుపై మాటేనని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో   విదేశాంగ శాఖ సహాయ మంత్రి  మురళీధరన్  ఈ విషయాన్ని  ప్రకటించారు.   ఈ కాలంలో మోదీ 21 విదేశీ పర్యటనలు చేశారని, ఈ పర్యటనల కోసం రూ. 22.76 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 2019 నుండి, ప్రధాని జపాన్‌ను మూడుసార్లు, అమెరికా, యుఎఇలను రెండుసార్లు సందర్శించారు.


అలాగే 2019 నుండి  రాష్ట్రపతి ఎనిమిది పర్యటనలలో అప్పటి   దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్   ఏడు,  ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక విదేశీ పర్యటన ( గత సెప్టెంబర్‌లో యూకేనుసందర్శించారు)  ఈ పర్యటనల కోసం రూ. 6.24 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు  మంత్రి తెలిపారు.  2019 రాష్ట్రపతి ఎనిమిది విదేశీ  పర్యటనల  మొత్తం ఖర్చు 6,24,31,424, ప్రధానమంత్రి పర్యటన ఖర్చు రూ.22,76,76,934  అలాగే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 86 విదేశీ పర్యటనలు చేయగా దీని వ్యయం రూ.  20,87,01,475 అని  కేంద్రం వెల్లడించింది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు