'వాణిజ్య భవన్‌'ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

23 Jun, 2022 12:32 IST|Sakshi

మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ విభాగానికి చెందిన 'వాణిజ్య భవన్‌'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. (ఎన్‌ఐఆర్‌వైఏటీ) నేషనల్‌ ఇంపోర్ట్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ రికార్డ్‌ ఫర్‌ ఇయర‍్లీ అనాలసిస్‌ ఆఫ్‌ ట్రేడ్‌ పోర్టల్‌ని లాంచ్‌ చేశారు. ఈ పోర‍్టల్‌ స్టేక్ హోల్డర్లకు ఒక వేదికలా ఉపయోగ పడుతుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం ఇలా ఉంది. 

వాణిజ్య భవన్‌,ఎన్‌ఐఆర్‌వైఏటీ పోర్టల్‌తో ఆత్మనిర్భర్ భారత్ ఆకాంక్షలు నెరవేరుతాయి.వాణిజ్య-వ్యాపార సంబంధాలతో పాటు చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు సానుకూల ఫలితాలు పొందవచ్చని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 

వాణిజ్య భవన్‌తో వ్యాపార-వాణిజ్య రంగాలకు చెందిన వారితో పాటు ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూరుతుంది.

గతేడాది ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. అదే సమయంలో భారత్‌ 670 బిలియన్‌ల(భారత కరెన్సీలో రూ.50లక్షల కోట్లు) ఎగుమతులు చేసింది. 

దేశ ప్రగతికి ఎగుమతులు కీలకం. 'వోకల్ ఫర్ లోకల్' వంటి కార్యక్రమాలు దేశ ఎగుమతులను వేగవంతం చేసేందుకు దోహద పడ్డాయని మోదీ తెలిపారు.  

గతేడాది దేశం ప్రతి సవాలును ఎదుర్కొన్నప్పటికీ ఎగుమతుల విషయంలో భారత్‌ 400 బిలియన్ల పరిమితిని దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ మనం అనూహ్యంగా 418 బిలియన్ డాలర్లు అంటే 31 లక్షల కోట్ల రూపాయల ఎగుమతితో సరికొత్త రికార్డ్‌ను సృష్టించాం.

ఈరోజు ప్రతి మంత్రిత్వ శాఖ, ప్రభుత్వంలోని ప్రతి విభాగం 'పూర్తి ప్రభుత్వ' విధానంతో ఎగుమతులను పెంచడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి." ఎంఎస్‌ఎంఈ, మంత్రిత్వ శాఖ లేదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వ్యవసాయం,వాణిజ్య మంత్రిత్వ శాఖ..ఇలా అందరూ ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి కట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు