Narendra Modi US Visit భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయండి

24 Sep, 2021 03:54 IST|Sakshi
క్వాల్‌కామ్‌ సీఈవో క్రిస్టియానో అమోన్‌తో ప్రధాని మోదీ సమావేశం

అమెరికన్‌ దిగ్గజాలకు ప్రధాని మోదీ ఆహ్వానం

అయిదు సంస్థల సీఈవోలతో భేటీ

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయిదు రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహా్వనించారు. భారత్‌లో వ్యాపార అవకాశాల గురించి వివరించారు. చిప్‌ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌ సీఈవో క్రిస్టియానో ఇ అమోన్, సౌర విద్యుత్‌ సంస్థ ఫస్ట్‌ సోలార్‌ చీఫ్‌ మార్క్‌ విడ్మర్, ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ చైర్మన్‌ స్టీఫెన్‌ ఎ ష్వార్జ్‌మాన్, అడోబ్‌ చైర్మన్‌ శంతను నారాయణ్, జనరల్‌ అటామిక్స్‌ సీఈవో వివేక్‌ లాల్‌తో ప్రధాని భేటీ అయ్యారు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం

ఐటీ, డిజిటల్‌ రంగానికి భారత్‌ ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో నారాయణ్‌తో మోదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక సాయుధ బలగాల కోసం భారత్‌ గణనీయంగా డ్రోన్‌లను కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో మి లిటరీ డ్రోన్ల తయారీ దిగ్గజం జనరల్‌ అటామిక్స్‌ సీఈవో లాల్‌తో ప్రధా ని సమావేశమయ్యారు. జనరల్‌ అటామిక్స్‌ నుంచి భారత్‌ ఇప్పటికే కొన్ని డ్రోన్‌లను లీజుకు కూడా తీసుకుంది. దాదాపు 18 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ద్వైపాక్షిక రక్షణ రంగ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో లాల్‌ కీలక పాత్ర పోషించారు.
చదవండి: ఢిల్లీకి సీఎం కేసీఆర్‌.. హస్తినలో మూడు రోజులపాటు

మరోవైపు, మరిన్ని పెట్టుబడులను సాధించే క్రమంలో అగ్రగామి ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ బ్లాక్‌స్టోన్‌ చైర్మన్‌ ష్వార్జ్‌మాన్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. అటు దేశీయంగా 5జీ టెలికం టెక్నాలజీ అమల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా క్వాల్‌కామ్‌ చీఫ్‌ అమోన్‌తో సమావేశమయ్యారు. దేశీయంగా తయారీ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆయన్ను ఆహ్వానించారు. ఈ సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఫస్ట్‌ సోలార్‌ హెడ్‌ విడ్మర్‌తో సమావేశం సందర్భంగా భారత్‌లో పునరుత్పాదక విద్యు త్‌ రంగంలో అవకాశాల గురించి ప్రధాని చర్చించినట్లు వివరించింది.
 

మరిన్ని వార్తలు