కస్టమర్లకు గట్టి షాక్ ఇచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్..!

10 Jan, 2022 18:55 IST|Sakshi

పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఖాతాదారులకు అందించే సేవలకు సంబంధించిన చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు జనవరి 15 నుంచి అమలులోకి వస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. కనీస ఖాతా బ్యాలన్స్, బ్యాంక్ లాకర్ ఛార్జీలు, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు పెంచిన జాబితాలో ఉన్నాయి.

కనీస బ్యాలెన్స్: మెట్రో ప్రాంతంలో త్రైమాసిక సగటు బ్యాలెన్స్(క్యూఎబి) పరిమితిని ₹10,000కు పెంచారు. ఇంతకు ముందు పరిమితి ₹5,000గా ఉండేది. త్రైమాసిక కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు గ్రామీణ ప్రాంతాల్లో రుసుమును ₹200 నుంచి ₹400కు, పట్టణ & మెట్రో ప్రాంతాల్లో ₹300 నుంచి ₹600పెంచినట్లు పీఎన్‌బీ తెలిపింది.
బ్యాంక్ లాకర్ ఛార్జీలు: పీఎన్‌బీ గ్రామీణ, సెమీ అర్బన్, పట్టణ & మెట్రో ప్రాంతాల్లో తన లాకర్ అద్దె ఛార్జీలను కూడా పెంచింది. పట్టణ ప్రాంతాల్లో లాకర్ ఛార్జీలను ₹500 పెంచారు.
బ్యాంక్ లాకర్: జనవరి 15, 2021 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చిన తర్వాత లాకర్ ని ఏడాదికి ఉచితంగా చూసే సంఖ్య 12(ఇంతకముందు 15)కు తగ్గుతుంది. ఆ తర్వాత లాకర్ తెరిచిన ప్రతిసారి ₹100 చెల్లించాల్సి ఉంటుంది.
కరెంట్ అకౌంట్ మూసివేత ఛార్జీలు: కరెంటు ఖాతా తెరిచిన 14 రోజుల తర్వాత ఖాతాను రద్దు చేస్తే రూ.800 అపరాధ రుసుము చెల్లించాలి. ఇంతకు ముందు ఇది రూ.600గా ఉండేది. కరెంటు ఖాతా తెరిచిన 12 నెలల తరువాత రద్దు చేస్తే ఎలాంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు.
పొదుపు ఖాతా లావాదేవీల రుసుము: జనవరి 15 నుంచి పీఎన్‌బీ నెలకు 3 ఉచిత లావాదేవీలను చేసుకునే అనుమతిస్తుంది. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి ₹50/(బీఎన్‌ఏ, ఏటీఎమ్‌, సిడీఎమ్‌ వంటి ప్రత్నామ్నాయ ఛానళ్లు మినహాయించి) ఛార్జ్ చేస్తుంది. అలాగే, సీనియర్ సిటిజన్ ఖాతాలకు ఇది వర్తించదు. ఇంకా పొదుపు, కరెంట్ ఖాతాల్లో లావాదేవీ ఫీజులను కూడా పెంచింది.  ప్రస్తుతం బ్యాంక్‌ బేస్‌, నాన్‌-బేస్‌ బ్రాంచ్‌లకు ప్రస్తుతం 5 ఉచిత లావాదేవీలను బ్యాంకు అనుమతిస్తుంది. ఆ తర్వాత ఆపై చేసే ప్రతి లావాదేవీకి రూ.25 ఛార్జ్‌ చేస్తుంది. 
క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు: పొదుపు, కరెంట్‌ ఖాతాల రెండింటిపై కూడా నగదు డిపాజిట్‌ పరిమితిని తగ్గించింది. రోజుకు ఉచిత డిపాజిట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న ₹2 లక్షల నుంచి ₹1 లక్షకు తగ్గించింది. 

(చదవండి: శాంసంగ్‌ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ సేవలు పూర్తిగా బంద్‌..!)

మరిన్ని వార్తలు