పీఎన్‌బీలో మరో భారీ స్కాం

2 Oct, 2020 09:31 IST|Sakshi

రూ.1,200 కోట్లకు కుచ్చు టోపీ పెట్టిన సింటెక్స్ ఇండస్ట్రీస్

సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)లో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ (సిల్) 1,203.26 కోట్ల రూపాయల  మేర టోపీ పెట్టింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి పీఎన్‌బీ స్కాం  వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాకముందే  పీఎన్‌బీ ఈ భారీ స్కాం గురించి రెగ్యులేటరీ ఫైలింగ్‌ సమాచారాన్ని అందించింది.  

అహ్మదాబాద్ జోనల్ కార్యాలయంలోని కార్పోరేట్ శాఖలో ఈ మోసం జరిగినట్లు తెలిపింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ మోసపూరితంగా రూ.1,203 కోట్ల రుణాన్ని పొందిందని బ్యాంకు ప్రకటించింది. సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్ క్లోజర్ రిక్వైర్ మెంట్స్ (ఎల్ఓడిఆర్) బ్యాంకు విధానాల ప్రకారం సింటెక్స్ ఇండస్ట్రీస్ నికర నిర్థక ఆస్తుల్లో రూ.1203 కోట్ల మేర మోసంతో తీసుకున్న రుణాలు ఉన్నాయని ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో  వెల్లడించింది.

మరిన్ని వార్తలు