నీరవ్ మోదీకి భారీ షాకిచ్చిన యూకే హైకోర్టు.. త్వరలో భారత్‌కు..

9 Nov, 2022 16:52 IST|Sakshi

చీటింగ్‌, మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొనేందుకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హైకోర్టులో చుక్కెదురైంది.  దేశం నుంచి పరారీలో ఉన్న నీరవ్‌ మోదీని భారత్‌కి తిరిగి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ పిటీషన్‌ దాఖలైంది. అయితే నీరవ్ మోదీని అప్పగించడం అన్యాయం లేదా అణచివేత కాదని కోర్టు పేర్కొంటూ అతని పిటీషన్‌ను తిరస్కరించింది. దీంతో త్వరలో నీరవ్‌ భారత్‌కు రానున్నారు. ఈ అప్పీల్ విచారణకు అధ్యక్షత వహించిన లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్,  జస్టిస్ రాబర్ట్ జే ఈ తీర్పును వెలువరించారు.

ఆగ్నేయ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో కటకటాల వెనుక ఉన్న 51 ఏళ్ల వ్యాపారవేత్త, గత ఫిబ్రవరిలో భారత్‌కు అప్పగింతకు అనుకూలంగా జిల్లా జడ్జి సామ్ గూజీ వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు అనుమతి పొందిన సంగతి తెలిసిందే. కాగా నీరవ్‌ మోదీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ని రూ. 13,500 కోట్ల మేర మోసం చేసి విదేశాలకు పారిపోయాడు. అప్పటినుంచి భారత్‌కు తిరిగి రాకుండా తప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తున్నాడు. 

చదవండి: క్యూ కడుతున్న టాప్‌ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్‌ మస్క్‌!

మరిన్ని వార్తలు