పోకో ఎఫ్ 3 జీటీ జూలై 23న లాంఛ్

16 Jul, 2021 21:13 IST|Sakshi

పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌ జూలై 23న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కంపెనీ రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లను టీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డాల్బీ అట్మోస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తున్నట్లు ధృవీకరించింది. చైనాలో ఏప్రిల్ లో రెడ్ మీ కె40 గేమింగ్ పేరుతో లాంచ్ చేసిన మొబైల్ కి రీబ్రాండెడ్ ఎడిషన్ గా పోకో ఎఫ్3 జీటీని తీసుకొస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పోకో బ్రాండ్ కింద 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్‌ ఇదే.

ఈ స్మార్ట్‌ఫోన్‌ లో "స్లిప్ స్ట్రీమ్ డిజైన్", యాంటీ ఫింగర్ ప్రింట్ మ్యాట్ ఫినిష్ ఉందని కంపెనీ పేర్కొంది. ఫ్రేమ్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అలాయ్ నుంచి తయారు చేశారు. పోకో ఎఫ్3 జీటీని మొదట మేలో ఆటపట్టించారు. 2021 క్యూ3లో తీసుకొస్తారని అప్పుడు పేర్కొన్నారు. మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పోకో ఎఫ్3 జీటీ 120హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేటు, హెచ్ డీఆర్ 10+, డీసీ డిమ్మింగ్ తో 10-బిట్ అమోల్డ్ డిస్ ప్లేను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. రెడ్ మి కె40 గేమింగ్ ఎడిషన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర చైనాలో సీఎన్ వై 1,999 (సుమారు రూ. 23,000) లాంచ్ చేశారు.

మరిన్ని వార్తలు