పోకో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌, స్పెషల్‌ ఫీచర్లతో

21 Jun, 2022 16:01 IST|Sakshi

పోకో వరుసగా రెండు ఫోన్‌లు

పోకో  ఎఫ్‌ 4 5జీ   స్మార్ట్‌ఫోన్‌

పోకో ఎక్స్‌ 4 జీటీ

సాక్షి,ముంబై: పోకో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్‌ చేయనుంది. జూన్‌ 23 సాయంత్రం వర్చువల్‌ ఈవెంట్‌లో పోకో  ‘ఎఫ్‌ 4 5జీ’  స్మార్ట్‌ఫోన్‌ను  తీసుకురానుంది.  పోకో బ్రాండింగ్‌తో  ఫ్లాట్ బాడీ రియర్‌ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో  ఇది అందుబాటులోకి  రానుంది. అంతేకాదు వ్లాగ్ మోడ్ కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేస్తున్నట్టు పోకో ట్వీట్‌ చేసింది. 

ఫీచర్లు, అంచనాలు
ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు రెడ్‌మి కే40ఎస్‌కి దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. దీంతో పాటు 7లేయర్ గ్రాఫైట్ షీట్‌ల లిక్విడ్ కూల్ 2.0, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు , 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉంటాయట. బ్లాక్‌ అండ్‌ గ్రీన్‌ రంగులలో ఇది లభ్యం కానుంది.  
ఆండ్రాయిడ్‌ 12 OS ఆధారిత ఎంఐయుఐ 
1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన అమెలెడ్‌ డిస్‌ప్లే 
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC
12 జీబీ ర్యామ్‌, 126 జీబీ స్టోరేజ్‌  
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 64 ఎంపీ మెయిన్‌గా, ట్రిపుల్‌  కెమెరా,  

దీంతోపాటు పోకో ఎక్స్‌ 4జీటీ అనే మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్‌ చేయనున్నట్టు పోకో ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

పోకో ఎక్స్‌ 4 జీటీ ఫీచర్లు
6.6అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
మీడియా టెక్‌  డైమెన్సిటీ 8100 SOC
8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ 
20 ఎంపీ  ఫ్రంట్‌ కెమెరా, 64ఎంపీ రియర్‌ కెమెరా
5080 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

మరిన్ని వార్తలు