పోకో 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌: ధర ఎంతంటే?

8 Jun, 2021 15:38 IST|Sakshi

పోకో  తొలి  5జీ స్మార్ట్ ఫోన్‌

త‌క్కువ ధ‌ర,  అద్భుత ఫీచ‌ర్లు

4 జీబీ B ర్యామ్‌ , 64 జీబీ  స్టోరేజ్‌  ధర రూ.13,999 

6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌  ధర రూ.15,999

సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ పొకో కూడా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  పోకో తన తొలి  5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో మంగళవార  విడుదల చేసింది. పొకో ఎం3  ప్రొ పేరుతో రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌, 48 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌  కెమెరా‌, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

తొలి సేల్‌, ధరలు, లాంచింగ్‌ ఆఫర్‌ 
4 జీబీ B ర్యామ్‌ + 64 జీబీ  స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.13,999 
6 జీబీ ర్యామ్‌ + 128 జీబీ  స్టోరేజ్‌  ధర రూ.15,999 
ఈ స్మార్ట్‌ఫోన్‌ జూన్‌ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా  కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.  లాంచింగ్‌ ఆఫర్‌గా  జూన్ 14 న మాత్రమే తొలి సేల్‌లో రెండు వేరియంట్లపై  500  తగ్గింపు ఇస్తున్నట్లు పొకో ఇండియా పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్పెషల్‌ సేల్‌ జూన్‌ 14న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.  తద్వారా  5జీ స్మార్ట్‌ఫోన్‌  విభాగంలో షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీలకు  గట్టి పోటి ఇస్తోంది.

పొకో ఎం3  ప్రొ ఫీచర్లు 
6.50 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే 
ఆండ్రాయిడ్‌ 11
మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌
6 జీబీ ర్యామ్‌ ,128 జీబీ స్టోరేజ్‌ 
8 మెగా పిక్సెల్‌ సెల్ఫీకెమెరా
48+2+2  ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

మరిన్ని వార్తలు