బిగ్ బ్యాటరీతో వస్తున్న పోకో ఎం3

23 Nov, 2020 14:55 IST|Sakshi

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి యొక్క సబ్-బ్రాండ్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టిన పోకో సంస్థ కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంచ్ లతో అందరి దృష్టిని ఆకట్టుకున్నది. ఈ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో పోకో ఎం2తో పాటుగా పోకో ఎం2 ప్రోను కూడా ఇండియాలో విడుదల చేసింది. సంస్థ ఇప్పుడు వీటికి అప్ డేట్ వెర్షన్ గా పోకో ఏం3ను తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. పోకో ఎం3ను నవంబర్ 24న ఐరోపా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు స్మార్ట్‌ఫోన్ కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు, పోకో ఏం3 ఫోన్ యొక్క డిస్‌ప్లే, బ్యాటరీ, చిప్‌సెట్‌తో సహా మొబైల్ గురించి కొన్ని వివరాలను అధికారికంగా ధ్రువీకరించింది. పోకో ఎం3 స్పెసిఫికేషన్లలో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 6.53-అంగుళాల డిస్ప్లే ఉన్నాయి. పోకో డిజైన్‌ను కూడా వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్, వెనుక ప్రత్యేకమైన దీర్ఘచతురస్రాకార బ్లాక్‌తో ఆకృతి గల కెమెరా ప్యానల్‌తో వస్తుంది. ప్రధాన కెమెరా విభాగంలో ఎల్ఇడీ ఫ్లాష్ మరియు పోకో బ్రాండింగ్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అందరు పోకో ఎం3 ధర గురుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు లాంచ్ ఈవెంట్ లో దీని ధరను వెల్లడించనున్నారు. (చదవండి: ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్‌ ఫోన్స్)

పోకో ఏం3 ఫీచర్స్
పోకో ఏం3 బెజెల్-తక్కువ 6.53-అంగుళాల డిస్ప్లేతో ఫుల్ హెచ్ డి ప్లస్ రిజల్యూషన్ మరియు సెల్ఫీ కెమెరా కోసం పైన వాటర్‌డ్రాప్ నాచ్ ఉంటుంది. కనీసం 4జీబీ ర్యామ్ తో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్
తీసుకు రానున్నారు. అయితే 6,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. పోకో ఏం3లో ఆండ్రాయిడ్ 10-ఆధారిత ఎంఐయుఐ 12ను పోకో ఏం3 బాక్స్ లో తీసుకురానున్నారు. పోకో ఏం3 ట్రిపుల్ రియర్ కెమెరాలతో పాటు 48 ఎంపీ ప్రాథమిక సెన్సార్ ఉంటుంది. మిగిలిన కెమెరా సెన్సార్లు, స్టోరేజ్ గురించి వివరాలు ప్రస్తుతానికి మిస్టరీగా ఉన్నాయి. పోకో ఏం3 నలుపు, నీలం, పసుపు అనే మూడు రంగులలో రానున్నట్లు సమాచారం. భారతదేశంలో పోకో ఎం3 విడుదల గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

>
మరిన్ని వార్తలు