త్వరలో పోకో F2 స్మార్ట్‌ ఫోన్‌ విడుదల

2 Jan, 2021 11:41 IST|Sakshi

ట్విటర్‌ ద్వారా పేర్కొన్న కంపెనీ

స్నాప్‌డ్రాగన్‌ 732జీ ప్రాసెసర్

‌120 హెచ్‌జెడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే

ధరలు రూ. 20,000-25,000 మధ్య!

4,250 ఎంఏహెచ్ బ్యాటరీ అంచనా

ముంబై, సాక్షి: దేశీ మార్కెట్లలో ఈ ఏడాది(2021)లో  పోకో F2 స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ట్విటర్‌ ద్వారా తాజాగా పేర్కొంది. 2020లో కంపెనీ సాధించిన మైలురాళ్లపై ఒక వీడియోను పోస్ట్‌చేస్తూ పోకో ఇండియా పలు అంశాలను ప్రస్తావించింది. 2018లో విడుదల చేసిన  పోకో F1 స్మార్ట్‌ ఫోన్‌ స్థానే సరికొత్త ఫీచర్స్‌తో  పోకో F2ను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేసింది. 10 లక్షల ఫోన్లను విక్రయించడం ద్వారా దేశీయంగా ఆన్‌లైన్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లలో టాప్‌-5లో ఒకటిగా నిలుస్తున్నట్లు పోకో వెల్లడించింది. అయితే  పోకో F2 స్మార్ట్‌ ఫోన్‌ సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఈ ఫోన్‌ ఫీచర్స్‌పై టిప్‌స్టెర్‌ తదితర టెక్‌ నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయంటే..  చదవండి: (2021లో రియల్‌మీ కీలక ఫోన్‌- కేవోఐ )

ఫీచర్స్‌ ఇలా

పోకో F2 స్మార్ట్‌ ఫోన్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 732జీ ప్రాసెసర్‌తో విడుదలకానుంది. గతంలో రూ. 16,000 ధరలో విడుదల చేసిన పోకో X3 మోడల్‌లో వినియోగించిన ఎస్‌వోసీతో 4,250 ఎంఏహెచ్ బ్యాటరీను కలిగి ఉంటుంది. వెనుకవైపు 64 ఎంపీ సెన్సర్‌తో క్వాడ్‌కెమెరాలకు వీలుంది. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేటుతో అమోలెడ్‌ డిస్‌ప్లేను ఏర్పాటు చేయనుంది. ఈ స్పెసిఫికేషన్స్ అంచనాలతో చూస్తే పోకో F2 స్మార్ట్‌ ఫోన్‌ ధరలు రూ. 20,000-25,000 మధ్య ఉండవచ్చు.  (రియల్‌మీ నుంచి స్మార్ట్‌ వాచీలు రెడీ)

మరిన్ని వార్తలు