పోకో ఎక్స్3 లాంచ్.. ధర, ఫీచర్లు

22 Sep, 2020 16:21 IST|Sakshi

బిగ్ బ్యాటరీ, క్వాడ్ కెమెరా

పోకో ఎక్స్3

సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు పోకో మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు, భారీ బ్యాటరీ అందుబాటు ధరలో పోకో  ఎక్స్3 పేరుతో భారతీయ మార్కెట్లో  తీసుకొచ్చింది.   పోకో ఎక్స్2 స్మార్ట్ ఫోన్‌కు కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది. గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న పోకో ఎక్స్3 ఎట్టకేలకు మనదేశంలో కూడా అందుబాటులోకి  తెస్తోంది. గత నెలలో యూరోప్‌లో లాంచ్ అయిన పోకో ఎక్స్3 ఎన్ఎఫ్‌సీ మాదిరిగానే దీన్ని రూపొందించింది. 

పోకో ఎక్స్3 ధర, లభ్యత
మూడు వేరియంట్లు,  కోబాల్ట్ బ్లూ, షాడో గ్రే రంగుల్లో పోకో ఎక్స్ 3 లభ్యం.
6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499 
హైఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999
ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి  విక్రయానికి అందుబాటులో ఉంటుంది. 

పోకో ఎక్స్3  ఫీచర్లు
6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను 
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ 
ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12
ఆక్టాకోర్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ 
8 జీబీ ర్యామ్, 128 జీబీ  స్టోరేజ్ 
256 జీబీ వరకు పెంచుకునే అవకాశం
64 +13 +2 +2 మెగా పిక్సెల్  రియర్ క్వాడ్ కెమెరా
20 మెగాపిక్సెల్  సెల్ఫీ కెమెరా
6000 ఎంఏహెచ్ బ్యాటరీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా