అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్3

23 Mar, 2021 22:17 IST|Sakshi

పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్3 ఫోన్లు గ్లోబల్ లాంచ్ అయ్యాయి. వీటిలో పోకో ఎక్స్3 ప్రోలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. గత నెలలో చైనాలో లాంచ్ అయిన రెడ్ మీ కే40కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించారు. 5జీ సపోర్ట్ కూడా ఉంది. వీటిలో పోకో ఎక్స్3 ప్రో మన దేశంలో మార్చి 30వ తేదీన లాంచ్ కానుంది.

పోకో ఎక్స్3 ప్రో ఫీచర్లు:

 • 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ డిస్ ప్లే 
 • స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌  
 • టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌ 
 • గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ 
 • ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌
 • 6 జీబీ, 8 జీబీ ర్యామ్
 • 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్
 • 48 ఎంపీ + 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ +  2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరా
 • 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
 • ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 
 • బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్  
 • 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 
 • 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 249 యూరోలు(సుమారు రూ.21,400) 
 • 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 299 యూరోలు(సుమారు రూ.25,700) 

పోకో ఎఫ్3 ఫీచర్లు:

 • 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్ ప్లే
 • రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్  
 • టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్ 
 • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ 
 • ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 
 • 6 జీబీ, 8 జీబీ ర్యామ్
 • 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్
 • 48 ఎంపీ + 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ + 5 ఎంపీ టెలిమాక్రో కెమెరా 
 • 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
 • ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 
 • బ్యాటరీ సామర్థ్యం 4520 ఎంఏహెచ్ 
 • 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ 
 • 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 349 యూరోలు(సుమారు రూ.30,100) 
 • 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 399 యూరోలు(సుమారు రూ.34,400) 

చదవండి:

ఫేస్‌బుక్‌ మరో సంచలనం 

జాగ్వార్‌‌ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదల

మరిన్ని వార్తలు