Porsche: పోర్స్చేకు చైనా భారీ షాక్‌!

20 Jun, 2022 20:49 IST|Sakshi

ప్రముఖ పోర్స్చే టేకాన్ సంస్థకు చైనా స్టేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ మార్కెట్‌ రెగ్యులేషన్‌ (ఎస్‌ఎంఆర్‌) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోర‍్స్చేకు చెందిన 6,172 కార్లను రీకాల్‌ చేయాలని ఆదేశించింది. 
 
చైనాలో అమ్మకాలు జరిపిన పోర్స్చే 2020-21 సంవత్సరానికి చెందిన మోడల్‌ ఎలక్ట్రిక్‌ కార్లను రీకాల్‌ చేయాలని ఎస్‌ఎంఆర్‌ తెలిపింది.పోర్స్చే టేకాన్ డ్రైవింగ్‌ సీట్‌ వైరింగ్‌ సమస్యలతో పాటు సీట్ల సప్లిమెంటల్ రెస్ట్రెయింట్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్‌) పని చేయడంలో విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అనుమానం వ్యక్తం చేసింది. సీటు పనికిరాకుండా పోయినా లేదా ఎస్‌ఆర్‌ఎస్‌ పని చేయడం ఆగినా వెహికల్‌ క్రాష్‌ అవుతుందనే అనుమానం వ్యక్తం చేసింది. అందుకే ఆ కార్లను రీకాల్‌ చేయాలని తెలిపింది.

దీంతో పోర్స్చే తన డీలర్ల వద్ద రీకాల్ చేసిన అన్ని వాహనాలపై సీట్ వైర్ హార్నెస్‌లను ఫ్రీగా చెక్‌ చేయాలని ఎస్‌ఆర్‌ఎస్‌ ఆదేశించినుంది. ఒక జీను పాడైపోయినా లేదా డిస్‌కనెక్ట్ అయిన సందర్భంలో, పోర్స్చే దానిని రిపేర్ చేస్తుంది. లేదంటే మార్చేస్తుంది.     

మరిన్ని వార్తలు