అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పార్సిల్స్‌ వైరల్‌ వీడియో: అమెజాన్‌ క్లారిటీ

30 Aug, 2022 15:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెజాన్‌ పార్సిళ్లను విసిరిపారేస్తున్న వైనంపై ఆన్‌లైన్‌ రీటైలర్‌  అమెజాన్‌ స్పందించింది. వీడియోలో ని దృశ్యాలు వాస్తవమైనవే అయినా, ఇది పాత వీడియో ..దీనిపై ఇప్పటికే  చర్యలు తీసుకున్నామని వివరణ ఇచ్చింది. 

ఈ  వీడియో వైరల్ కావడంపై స్పందించిన అమెజాన్ ప్రతినిధులు ఇవి ఈ ఏడాది మార్చిలో బయటకు వచ్చిన వీడియో అని తెలిపారు. వీడియో సరైందే అయినా మీడియాలో ఆలస్యంగా వచ్చిందని తెలిపారు. ఈ వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే సరైన చర్యలు తీసుకున్నామని, కస్టమర్లకు నాణ్యమైన వస్తువులను అందించడమే తమ లక్ష్యమని  అమెజాన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. 

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పార్సిల్స్ పరిస్థితి ఇదీ అంటూ ట్విటర్‌లో ఒక వీడియో బాగా షేర్‌ అయింది. అసోంలోని రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పోర్టర్లు  అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌, ఇతర ప్యాకేజీలను విసిరిపారేసిన వీడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. అయితే ఇది న్యూఢిల్లీ దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (12424) ద్వారా వచ్చాయని తెలుస్తోంది.  ఈ విజువల్స్ మార్చి 14న రికార్డయ్యాయట. అయితే తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, ప్యాకేజీలను విసిరిపారేసింది. భారతీయ రైల్వే సిబ్బంది కాదని స్పష్టం చేస్తూ నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. "పార్సెల్స్‌ను నిర్వహించే వ్యక్తులు పార్శిల్ వ్యాన్‌ను లీజుకు తీసుకున్న పార్టీ  ఎంపిక చేసుకుంటుందనీ  తెలిపారు.   దీని  ప్రకారం, వారి క్లయింట్  పార్శిల్‌లను SLR/పార్శిల్ వ్యాన్‌ల నుండి లోడ్ చేయడం/అన్‌లోడ్ చేయడం వారి బాధ్యదే" అని పేర్కొంది.

మరిన్ని వార్తలు