ఫ్రెషర్ల నియమాకాలపై కంపెనీల్లో సానుకూలత

20 Oct, 2022 05:41 IST|Sakshi

  టీమ్‌లీజ్‌ ఎడ్యుటెక్‌ నివేదిక

ముంబై: ఫ్రెషర్లకు ఉపాధి కల్పించే విషయంలో కంపెనీల్లో సానుకూల ధోరణి 61 శాతానికి పెరిగింది. టెక్నాలజీ, డిజిటల్‌ సేవలకు డిమాండ్‌తో సంస్థలు మరింత మంది ఫ్రెషర్లను తీసుకోవాలని అనుకుంటున్నట్టు టీమ్‌లీజ్‌ ఎడ్యుటెక్‌ కెరీర్‌ అవుట్‌లుక్‌ నివేదిక తెలిపింది. దీంతో ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాలు గతేడాది జూన్‌–డిసెంబర్‌ కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలానికి మూడు రెట్లు అధికంగా ఉంటాయని పేర్కొంది.

ఈ ఏడాది ద్వితీయ భాగం ఆరంభంలో నిపుణులను ఆకర్షించడం ప్రముఖ కంపెనీలు, వ్యాపారవేత్తలకు ప్రాధాన్య అంశంగా మారినట్టు తెలిపింది. 865 చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీలపై టీమ్‌లీజ్‌ ఈ సర్వే నిర్వహించింది. ఐటీ 34 శాతం, ఈ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ స్టార్టప్‌లు 23 శాతం, టెలీ కమ్యూనికేషన్స్‌ 22 శాతం, ఇంజనీరింగ్‌ రంగం 20 శాతం మేర గతేడాది ఇదే కాలంతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది ద్వీతీయ ఆరు నెలల కాలంలో ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాల పరంగా.. బెంగళూరు 25 శాతం, ముంబై 19 శాతం, ఢిల్లీ 18 శాతం వృద్ధిని చూపించనునన్నట్టు అంచనా వేసింది.

మరిన్ని వార్తలు