పోస్టాఫీస్‌ పథకం: రూ.399కే రూ.10లక్షల యాక్సిడెంటల్‌ ఇన్స్యూరెన్స్‌!

30 Aug, 2022 21:39 IST|Sakshi

పోస్టల్‌ డిపార్ట్‌ మెంట్‌ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. టాటా ఏఐజీత కలిసి ఖాతాదారుల కోసం గ్రూప్‌ యాక్సిడెంట్‌ గార్డ్‌ పేరిట యాక్స్‌డెంట్‌ ఇన్స్యూరెన్స్‌ పాలసీని తీసుకువచ్చింది. ఈ పాలసీ హొల్డర్లు ఏడాదికి రూ.399 చెల్లించి రూ.10లక్షల యాక్సిడెంట్‌ ఇన్స్యూరెన్స్‌ సదుపాయాన్ని పొందవచ్చు. 

ఈ పాలసీ గురించి క్లుప్తంగా 

18 నుంచి 65ఏళ్ల వయసు కలిగిన వారు ఎవరైనా సరే పోస్టాఫీస్‌ నుంచి ఈ పాలసీని పొందవచ్చు. 

పాలసీ హోల్డర్లు ప్రమాదంలో మరణించినా, శాస్వత వైకల్యం ఏర్పడినా రూ.10లక్షలు చెల్లిస్తారు. 

ప్రమాదం జరిగి వైద్యం కోసం ఆస్పత్రిలో చేరితే రూ.60వేలు చెల్లిస్తారు. 

ఔట్‌ పేషంట్‌ రూ.30వేల వరకు క్లైమ్‌ చేసుకోవచ్చు. 

ఇక ఇదే పథకం కింద పాలసీ దారులు రూ.299 చెల్లించినా రూ.10లక్షల వరకు ఇన్స్యూరెన్స్‌ పొందవచ్చు. దీంతో పాటు ఇతర సౌకర్యాలు పొందవచ్చు.

మరిన్ని వార్తలు